Stree 2 Box Office:రిలీజ్‌కు ముందే కల్కి రికార్డు స్త్రీ 2 బ్రేక్..ప్రభాస్ కంటే శ్రద్దా మూవీ టాప్ కలెక్షన్లు!
పంద్రాగస్టు సెలవులను క్యాష్ చేసుకోవడానికి సినిమా రంగం భారీగా ప్లాన్ చేసింది. అన్ని భాషల్లోను పలు చిత్రాలు రిలీజ్‌కు సిద్దమయ్యాయి. లాంగ్ వీకెండ్‌లో ప్రేక్షకులు వినోదాన్ని భారీగా కోరుకొంటారనే పంథాను అనుసరించి బాలీవుడ్ మూడు సినిమాలను రిలీజ్‌కు సిద్దం చేసింది. అయితే శ్రద్దాకపూర్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ స్త్రీ 2 చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. అడ్వాన్స్ కలెక్షన్ల పరంగా ఈ మూవీ చేస్తున్న అలజడి వివరాల్లోకి వెళితే..
2018 సంవత్సరంలో ఎలాంటి అంచనాలు లేకుండా స్త్రీ మూవీ బాలీవుడ్‌లో రిలీజై భారీ వసూళ్లను సాధించింది. 25 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని దినేష్ విజన్, రాజ్ అండ్ డీకే నిర్మించారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 185 కోట్ల రూపాయల కలెక్షన్లను ప్రపంచ బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

6 ఏళ్ల క్రితం వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా స్త్రీ 2 చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే సుమారుగా 45 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రానికి కూడా అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఇటీవల రిలీజైన తమన్నా స్పెషల్ సాంగ్, శ్రద్దాకపూర్ పాటలకు మంచి స్పందన లభించింది.
అయితే ప్రమోషనల్ ఈవెంట్స్ భారీగా బజ్ క్రియేట్ చేయడంతో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు అయ్యాయి. ఈ సినిమా అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహం వేద సినిమాల కంటే ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేయడం రికార్డుగా మారింది. దాంతో ఈ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువగా అడ్వాన్స్ కలెక్షన్లను నమోదు చేసింది.
ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే 3.5 లక్షల టికెట్లు మల్టీప్లెక్స్‌లలో అమ్ముడుపోయాయి. వేద, ఖేల్ ఖేల్ మే చిత్రాల కంటే సుమారుగా 80 శాతం అధికంగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసుకొన్నది. దాంతో ఈ సినిమాకు తొలి రోజు భారీగా వసూల్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తొలి రోజు 10 నుంచి 15 కోట్ల మధ్య కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక శ్రద్దాకపూర్ నటించిన స్త్రీ 2 చిత్రం ఇండియన్ టాప్ హీరోల సినిమాల కంటే ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. ఇటవల రిలీజైన ఆర్టికల్ 370, హృతిక్ రోసన్ నటించిన ఫైటర్, ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాప్ నటించిన బడే మియా చోటే మియా, షైతాన్, క్రూ సినిమాల కంటే అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











