Stree 2 Closing Collections: 70 కోట్ల టార్గెట్.. శ్రద్దాకపూర్ మూవీకి ఎన్ని వందల కోట్ల లాభమంటే?
బాలీవుడ్ యువ హీరో, హీరోయిన్లు శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అపరాశక్తి ఖురానా తదితరులు నటించిన స్త్రీ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జైత్రయాత్రను ముగించింది. 6 ఏళ్ల క్రితం సంచలన విజయం సాధించిన స్త్రీ మూవీకు రీమేక్‌గా రూపొందిన సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఆగస్ట్ 15వ తేదీన రిలీజైన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
స్త్రీ 2 మూవీని మీడియం బడ్జెట్ రేంజ్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లతో కలిపి ఈ మూవీని సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను దాదాపు 70 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఇక ఈ మూవీ మంచి ఫాలోయింగ్ ఉండటంతో సుమారుగా 3 వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆదరణ ఎక్కువగా లభించడంతో భారీగా స్క్రీన్లను పెంచారు.

శ్రద్దాకపూర్ మూవీ తొలి రోజు సుమారుగా 9.5 కోట్ల రూపాయల కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. రెండో రోజు 56 కోట్ల రూపాయలు, 3వ రోజు 36 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత 45 కోట్లు, 60 కోట్ల రూపాయలతో వసూలు చేసి తొలివారాంతంలోనే 200 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఆ తర్వాత అదే జోష్‌ను కొనసాగిస్తూ రికార్డులు తిరగరాసింది.
నార్త్ అమెరికా అంటే.. అమెరికా, కెనడాతోపాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, సింగపూర్, మలేషియాలో భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా టోటల్ థియేట్రికల్ రన్‌లో 16 మిలియన్ డాలర్లు అంటే.. 135 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇటీవల కాలంలో కల్కి తర్వాత ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

స్త్రీ 2 చిత్రం గత 56 రోజులుగా బాక్సాఫీస్ వద్ద నిలకడగా సంచలన రీతిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో మొత్తంగా 820 కోట్ల రూపాయలు గ్రాస్, 625 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం అనూహ్యమైన లాభాలను నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు పంచిపెట్టింది. చిన్న చిత్రం సంచలన విజయం సాధించడం హిందీ మార్కెట్‌కు ఊపు నిచ్చింది.
బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో జర్నీ మొదలుపెట్టిన ఈ మూవీ దాదాపు 550 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది. గత రెండేళ్లలో ఈ రేంజ్ లాభాలను సాధించిన ఇండియన్ సినిమా ఇదే కావడం రికార్డుగా చెప్పుకొంటున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో పెద్ద హీరో లేకుండా ఈ రేంజ్ కలెక్షన్లను సాధించడం ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహం కనిపించింది.


Click it and Unblock the Notifications











