హిందీ సినీ ఇండస్ట్రీలో స్త్రీ 2 సరికొత్త చరిత్ర.. షారుక్, రణ్‌బీర్ రికార్డులను తిరగరాసిన శ్రద్దాకపూర్!

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ నటించిన స్త్రీ 2 చిత్రం హిందీ సినిమా చరిత్రను తిరగరాసింది. ఇప్పటి వరకు 100 ఏళ్ల చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అపరాశక్తి ఖురానా నటించిన చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా, దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ సినిమా సాధించిన సరికొత్త రికార్డు వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో 6 ఏళ్ల క్రితం ఘన విజయం సాధించిన స్త్రీ మూవీకి సీక్వెల్‌గా స్త్రీ 2 చిత్రం రూపొందింది. తమన్నా భాటియా ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. ఈ చిత్రం గత 40 రోజులుగా వసూళ్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది.

Stree 2 created All time highest in Hindi Film Industry beating Shah Rukh Khan Jawan

స్త్రీ 2 చిత్రానికి టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేయడంతో భారీ బడ్జెట్ సినిమాగా మారింది. ఈ ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను 60 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ మూవీకి భారీ ఆదరణ ఉండటంతో సుమారుగా 5500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాదాపు 60 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో కలెక్షన్ల ప్రయాణాన్ని ప్రారంభించింది.

స్త్రీ 2 మూవీకి ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఈ సినిమా 18 మిలియన్లకుపైగా వసూళ్లను సాధించింది. అంటే ఈ చిత్రం సుమారుగా 150 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల కలెక్షన్లు చేరువైంది. ఈ చిత్రం 40వ రోజున కూడా 5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడం విశేషంగా మారింది.

Stree 2 created All time highest in Hindi Film Industry beating Shah Rukh Khan Jawan

శ్రద్దాకపూర్ చిత్రం తొలివారమే రికార్డు వసూళ్లు నమోదు చేసింది. తొలివారం 304 కోట్లకుపైగా, రెండో వారం 145 కోట్ల రూపాయలు, మూడో వారం 73 కోట్ల రూపాయలు, నాలుగో వారం 38 కోట్ల రూపాయలు, ఐదో వారం 26 కోట్ల రూపాయలు, ఆరో వారం 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 604 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

స్త్రీ 2 చిత్రం హీందీ సినిమా రంగంలో స్టార్ హీరోలు షారుక్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ మూవీ, రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ, సన్నీ డియోల్ నటించిన గదర్ 2 మూవీ, ఆమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ కలెక్షన్ల రికార్డులను అధిగమించింది. తాజాగా జవాన్ సినిమా పేరిట హిందీలో ఉన్న అత్యధిక కలెక్షన్లు రికార్డు 584 కోట్ల రికార్డును తిరగ రాసింది. అలాగే 600 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X