Stree 2 Collections: శ్రద్దాకపూర్ మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. 100 కోట్లకు చేరువగా.. హృతిక్ రికార్డ్ ఫట్!
బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు శ్రద్దా కపూర్, రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అపరాశక్తి ఖురానా నటించిన చిత్రం స్త్రీ 2. 6 ఏళ్ల క్రితం వచ్చిన స్త్రీ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు రీమేక్‌గా రూపొందిన సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా, దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఆగస్ట్ 15వ తేదీన రిలీజైన ఈ సినిమా భారీ విజయం వైపు దూసుకెళ్లింది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
స్త్రీ 2 (Stree 2) సినిమాలో శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావ్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపి ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో రూపొందించారు. భారీగా ప్రమోషన్స్ నిర్వహించడంతోపాటు స్త్రీ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్‌తో రికార్డు ఓపెనింగ్స్ సాధించింది.

స్త్రీ సినిమా టీజర్లు, ట్రైలర్లు, తమన్నా స్పెషల్ సాంగ్ ప్రత్యేకమైన అటెన్షన్ క్రియేట్ చేశాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దాంతో ఈ సినిమాను 3000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు రావడానికి దోహదపడ్డాయి.
ఆగస్టు 14వ తేదీన స్త్రీ 2 పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించారు. పెయిడ్ షోల తర్వాత భారీగా ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది. దాంతో తొలి రోజు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను తొలి రోజే అధిగమించింది. ఫైటర్ సినిమా కలెక్షన్లను బీట్ చేసింది.

స్త్రీ (Stree 2 Collections) కలెక్షన్లను విషయానికి వస్తే.. ఈ సినిమా పెయిడ్ షోలకు రికార్డు వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తొలి రోజు ఈ చిత్రం 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 54 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. శ్రద్దా కపూర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు నమోదు అయ్యాయి.
ఇక స్త్రీ సినిమా రెండో రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టేందుకు సిద్దమైంది. ఈ చిత్రం 2వ రోజున 40 కోట్ల మేర వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











