చరిత్ర సృష్టించిన స్త్రీ 2.. 500 కోట్లతో సంచలనం.. 11వ రోజు హయ్యెస్ట్ వసూళ్లతో రికార్డుల మోత!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటించిన స్త్రీ 2 చిత్రం దేశంలోనే కాకుండా విదేశాల్లోకూడా సంచలనం రేపుతున్నది. ఈ చిత్రం విడుదల తర్వాత రెండో ఆదివారం రికార్డు వసూళ్లను రాబట్టింది. దాంతో హిందీ సినిమా పరిశ్రమలో ఈ సినిమా సరికొత్త చరిత్రను సృష్టించేందుకు పరుగులు పెడుతున్నది. గత 10 రోజుల్లో భారీ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం 11 రోజు తొలి రోజు సాధించిన కలెక్షన్లకు ధీటుగా ఈ సినిమా వసూళ్లు రాబడుతున్నది. రెండో వారాంతం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తమన్నా భాటియా కీలక పాత్రలోను, హీరో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అపరాశక్తి ఖురానా తదితరులు నటించిన మూవీని అమర్ కౌశిక్ దర్శకత్వంలో నిర్మాతలు దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ మూవీని సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇండియాలో స్త్రీ 2 చిత్రం కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నది. బాలీవుడ్‌లో 2024 సంవత్సరంలో రిలీజైన చిత్రాల్లో కంటే ఈ సినిమా అత్యధికంగా వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం తొలివారంలో 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదే జోష్‌ను రెండో వారంలో కూడా కొనసాగిస్తున్నది.
ఇక 2 వారంలో స్త్రీ 2 చిత్రం 9వ రోజు 17.5 కోట్ల రూపాయలు, 10వ 33 కోట్ల రూపాయలు, 11వ రోజు 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 387 కోట్ల రూపాయలు నమోదు చేస్తుందని పేర్కొన్నారు. ఓవర్సీస్‌తో కలుపుకొంటే ఈ సినిమా సుమారుగా 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ చిత్రం ఇండియాలో 400 కోట్ల నికర వసూళ్లు సాధించే దిశగా అడుగులేస్తున్నది.

ఓవర్సీస్‌లో శ్రద్దాకపూర్ సినిమాకు రికార్డు వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే 10 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. అంటే ఈ చిత్రం భారతీయ కరెన్సీలో సుమారుగా 84 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం విదేశీ గడ్డ మీదే 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాగా ఓ రికార్డు క్రియేట్ చేయబోతున్నది.
ఇదిలా ఉండగా స్త్రీ 2 చిత్రం ఇండియాలో 387 కోట్ల నికరంగా, ఓవర్సీస్‌లో ఈ చిత్రం 84 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఓవరాల్‌గా 505 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ ఊపు చూస్తుంటే ఈ చిత్రం త్వరలోనే 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను త్వరలోనే రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











