Stree 2 Box Office Report: 500 కోట్లకు చేరువగా స్త్రీ 2.. 10వ రోజు వసూళ్ల ఊచకోత.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దాకపూర్, హీరో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అపరాశక్తి ఖురానా తదితరులు నటించిన స్త్రీ 2 చిత్రం రెండోవారంలో కూడా ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను రాబడుతున్నది. తమన్నా భాటియా కీలక పాత్రలో నటించిన ఈ మూవీని అమర్ కౌశిక్ దర్శకత్వంలో నిర్మాతలు దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ చిత్రం గత 9 రోజులుగా కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. ఈ సినిమా 10వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..
హరర్, థ్రిల్లర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తోపాటు పుష్కలంగా వినోదాన్ని దట్టించి.. 2018 సంవత్సరంలో రూపొందిన స్త్రీ అనే బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా స్త్రీ 2 సినిమా రూపొందింది. టాప్ యాక్టర్ల రెమ్యునరేషన్లు, పాపులర్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేయడంతో నిర్మాణ వ్యయం భారీగా అయింది. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

స్త్రీ 2 చిత్రం రిలీజ్‌కు ముందే పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శించగా సుమారుగా 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రివ్యూ షోలతో బంపర్ హిట్ టాక్ సొంతం చేసుకొన్న ఈ మూవీ తొలి రోజు 56 కోట్లు వసూలు చేసింది. 2వ రోజు ఈ సినిమా 34 కోట్లు, 3వ రోజు 46 కోట్లు, 4వ రోజు 59 కోట్లు, 5వ రోజు 39 కోట్లు, 6వ రోజు 27 కోట్లు, 7వ రోజు 20 కోట్లు, 8వ రోజు 18 కోట్లు, 9వ రోజు 20 కోట్లు వసూలు చేసింది.
ఇక స్త్రీ 2 చిత్రం రెండో వారంలో రెండో శనివారం రోజున బాక్సాఫీస్ వద్ద ఊచకోతను మరిపించింది. ఈ సినిమా రికార్డు వసూళ్లను రాబట్టింది. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, లక్నో, ముంబై, హైదరాబాద్, భోపాల్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 55 నుంచి 65 శాతం మధ్య ఆక్యుపెన్సీ నమోదు చేసింది. దాంతో 10వ రోజు భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి.

స్త్రీ 2 చిత్రం అంచనాలను మంచి 10వ రోజు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం శనివారం అంటే 10వ రోజున 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియాలో సుమారుగా 350 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక ఓవర్సీస్‌లో కూడా విడుదలైన ప్రతీ చోట బాక్సాఫీస్‌ను ర్యాంప్ ఆడిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు 8.5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో ఈ మూవీ సుమారుగా 72 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 422 కోట్లు నికరంగా 470 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











