Stree 2 Box Office: స్త్రీ 2 బాక్సాఫీస్ కలెక్షన్ల సంచలనం.. షారుక్, ప్రభాస్ సినిమాల రికార్డులు బ్రేక్

బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ నటించిన స్త్రీ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన కలెక్షన్లు నమోదు చేస్తున్నది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ వసూళ్లు నమోదు చేస్తున్నది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో నిర్మాతలు దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ చిత్రం హిందీ సినిమా రికార్డులు తిరగరాస్తున్నది. ఈ సినిమా గత 15 రోజుల్లో రాబట్టిన కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..

2018 సంవత్సరంలో రూపొందిన స్త్రీ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో తమన్నా భాటియా కీలక పాత్రలోను, హీరో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అపరాశక్తి ఖురానా తదితరులు నటించారు. ఈ మూవీని సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Stree 2 Day 14 Expected Box Office Collections Worldwide Shraddha Kapoor movie crosses 600 crores club

స్త్రీ 2 చిత్రం సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను ఘనంగా రాబట్టింది. ఈ సినిమా తొలివారం 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండోవారంలో కూడా రికార్డు వసూళ్లు రాబట్టింది. 9వ రోజున ఈ సినిమా 17.5 కోట్లు, 10వ రోజున 33 కోట్ల రూపాయలు, 11వ రోజున 42.5 కోట్ల రూపాయలు, 12వ రోజున 18.5 కోట్ల రూపాయలు, 13వ రోజున 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలోనే సుమారుగా 419 కోట్ల రూపాయల నికర కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక స్త్రీ 2 చిత్రం ఓవర్సీస్‌లో కూడా భారీగా వసూళ్లు రాబడుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే 11.5 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 97 కోట్ల రూపాయలు నమోదు చేసింది. 14వ రోజు ఈ సినిమా ఓవర్సీస్‌లో 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Stree 2 Day 14 Expected Box Office Collections Worldwide Shraddha Kapoor movie crosses 600 crores club

ఇక 14వ రోజు కూడా స్త్రీ 2 చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన కనిపించింది. ఈ చిత్రం నిలకడగా అత్యధికంగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం రెండో బుధవారం 12 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మూవీ 590 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం 14వ రోజున ఈ చిత్రం సాధించే వసూళ్లతో ఈ మూవీ 600 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ చిత్రం భారీ లాభాలతో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X