Stree 2 Day 2 Box Office: 100 కోట్లకు చేరువగా స్త్రీ 2.. శ్రద్దా కపూర్ మూవీకి 2 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

గత కొన్నేళ్లుగా అస్తవ్యస్తంగా మారిన బాలీవుడ్ సినిమా పరిశ్రమకు స్త్రీ 2 చిత్రం భారీ ఊరటను ఇచ్చింది. శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అపరాశక్తి ఖురానా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం బాలీవుడ్‌లో అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

స్త్రీ 2 చిత్రం సుమారుగా 6 ఏళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం విజయం సాధించింది. 30 కోట్ల రూపాయలతో రూపొందిన చిత్రం ఏకంగా 120 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక స్త్రీ 2 చిత్రం 60 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రం కేవలం 2 రోజుల్లోనే 100 కోట్లకు చేరువ కావడం రికార్డుగా మారింది.

Stree 2 Day 2 Box Office Collections Worldwide Shraddha Kapoor Movie movie towards 100 crores

స్త్రీ 2 చిత్రానికి భారీగా బజ్ క్రియేట్ కావడంతో ఈ మూవీని రికార్డుస్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 3000 స్క్రీన్లలో కేవలం ఇండియాలోనే రిలీజ్ చేయగా, వరల్డ్ వైడ్‌గా 4500 స్క్రీన్లలో విడుదల చేసినట్టు సమాచారం. దాంతో ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ కూడా నమోదైంది.

స్త్రీ 2 మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమాను రిలీజ్ కంటే ముందే పెయిడ్ ప్రీమియర్లను దేశవ్యాప్తంగా ప్రదర్శించారు. ఈ సినిమాకు ప్రీమియర్ల ద్వారానే 9.5 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఇక తొలి రోజు ఈ సినిమా రికార్డు స్తాయిలో 55.4 కోట్లు రాబట్టింది. దాంతో 65 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ఇక 2 రెండో రోజు శుక్రవారం ఈ సినిమా 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతోఈ సినిమా 85 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా కేవలం 2 రెండు రోజుల్లోనే 100 కోట్ల రూపాయలకు చేరువైంది. ఈ సినిమా 3వ రోజు 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక స్త్రీ 2 చిత్రం 3వ రోజు భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన రావడంతో మిడ్ నైట్ షోలను ముంబైలో ప్రదర్శిస్తున్నారు. ప్రేక్షకుల తాకిడి ఉండటంతో అర్ధరాత్రి 11.30 గంటల తర్వాత ప్రత్యేకంగా షోలు ప్రదర్శిస్తున్నారు.

More from Filmibeat

Read more about: stree 2 shraddha kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X