Stree 2 Day 26 Box Office: బాహుబలి2 రికార్డు బ్రేక్ చేసిన స్త్రీ 2.. శ్రద్దాకపూర్ మూవీకి ఎన్ని వందల కోట్లంటే
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటించిన స్త్రీ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నది. ఈ చిత్రం గత 26 రోజులుగా భారీ వసూళ్లను రాబడుతూ పలువురు అగ్ర హీరోల రికార్డులను బీట్ చేసింది. బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అపరాక్షి ఖురానా తదితరులు నటించిన ఈ సినిమాను అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా, దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ సినిమా గత 26 రోజులుగా ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఏ మేరకు లాభాలను రాబట్టిందనే వివరాల్లోకి వెళితే..
స్త్రీ 2 చిత్రం 2018లో రూపొందిన స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. ఈ చిత్రాన్ని సుమారుగా 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను ఇండియాలో 3500 స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 70 కోట్ల రూపాయల షేర్‌గా నిర్ణయించారు. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 9.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక స్త్రీ 2 చిత్రం తొలి రోజు 55.5 కోట్ల రూపాయల కలెక్షన్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. అలా కలెక్షన్ల వేటను ప్రారంభించిన ఈ సినిమా తొలివారం 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండోవారంలో 142 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక మూడో వారం ఈ సినిమా 73 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. దాంతో 3 వారాల్లోనే 504 కోట్లకుపైగా నికర వసూళ్లను రాబట్టింది.
స్త్రీ 2 హిందీ మార్కెట్‌లో అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. బాహుబలి 2 హిందీ వెర్షన్ కలెక్షన్ల రికార్డును 3వ వారంలో బ్రేక్ చేసింది. మూడో వారంలో బాహుబలి 2 మూవీ 69.75 కోట్లు వసూలు చేస్తే.. ఈ మూవీ సుమారుగా 73 కోట్లు వసూలు చేసి ఆ రికార్డును అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్న స్త్రీ 2 చిత్రం నాలుగోవారంలో కూడా భారీగానే వసూళ్లు నమోదు చేసింది. 23వ రోజున ఈ సినిమా 4.5 కోట్లు, 24వ రోజున 8.5 కోట్లు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 25వ రోజున 11 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్‌గా రాబట్టింది. దాంతో 540 కోట్ల రూపాయల నెట్, 637 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు హిందీ మార్కెట్‌లో రాబట్టింది.
ఇక ఓవర్సీస్‌లో స్త్రీ 2 మూవీకి అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రం నార్త్ అమెరికాతోపాటు వివిధ దేశాల్లో భారీ వసూళ్లు నమోదు చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు 15.5 మిలియన్ డాలర్లు అంటే 130 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 770 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. దాంతో ఈ మూవీ సుమారుగా 600 కోట్లకుపైగా లాభాలను రాబట్టింది.


Click it and Unblock the Notifications











