Stree 2 Day 3 Box Office: స్త్రీ 2 కలెక్షన్ల సంచలనం..షారుక్, అక్షయ్ రికార్డులు శ్రద్దా కపూర్ బ్రేక్!
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద స్త్రీ 2 చిత్రం కలెక్షన్ల మోత మోగిస్తున్నది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంచనాలు మించి వసూళ్లను సాధిస్తున్నది. 2018లో రిలీజైన స్త్రీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. 6 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా స్త్రీ 2 చిత్రం రూపొందింది. ఈ సినిమా గత మూడు రోజులుగా, అలాగే ప్రీమియర్ల ద్వారా ఏ రేంజ్‌లో వసూళ్లు సాధించిందనే విషయంలోకి వెళితే..
స్త్రీ చిత్రం రిలీజ్‌కు ఒక రోజు ముందుగానే ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ల ద్వారా సుమారుగా 9.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇక ప్రీమియర్ల ద్వారా భారీ టాక్ రావడంతో తోలి రోజు రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.

ఇక తొలి రోజు శ్రద్దాకపూర్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించింది. ఈ చిత్రం తొలి రోజు 56 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రీమియర్లతో కలిపి ఈ చిత్రం తొలి రోజున 64 కోట్ల కలెక్షన్లను నమో్దు చేసింది. అలాగే శుక్రవారం రెండో రోజున కూడా స్థిరంగా కలెక్షన్లను నమోద చేసి 36 కోట్ల రూపాయలు నమోదు చేసింది.
ఇక మూడో రోజు కూడా ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం శనివారం సెలవు రోజును క్యాష్ చేసుకొని భారీగా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రం 44 కోట్ల రూపాయలు రాబట్టడం విశేషంగా మారింది. ఇటీవల కాలంలో ఓ వారాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా ఓ ఘనతను సాధించబోతున్నది.

కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కలెక్షన్లను భారీగా రాబట్టింది. ఈ చిత్రం నార్త్ అమెరికాతోపాటు ఇతర దేశాల్లో కేవలం మూడు రోజుల్లో 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 13 కోట్ల రూపాయలు విదేశీ మార్కెట్‌లో వసూలు చేసింది.
స్త్రీ 2 సినిమా తొలి రోజు 64 కోట్ల రూపాయలు, రెండో రోజున 36 కోట్ల రూపాయలు, మూడో రోజున 44 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే 140 కోట్లు ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఈ సినిమా హిందీ సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో అగ్రహీరోలు మినహాయిస్తే ఎవరు సాధించని కలెక్షన్లు రాబడుతున్నది. షారుక్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్, ఆ తర్వాత అక్షయ్ కుమార్ లాంటి చాలా మంది హీరోల లైఫ్ టైమ్ కలెక్షన్లను ఈ సినిమా దాటేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











