స్త్రీ 2 సంచలనం.. జవాన్ రికార్డును మడత పెట్టేసిన శ్రద్దాకపూర్.. షారుక్ రికార్డు ఫట్
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ నటించిన స్త్రీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపుతున్నది. ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. గత 35 రోజులుగా నిలకడగా వసూళ్లు రాబడుతూ కలెక్షన్ల సునామీని తలపించింది. ఈ చిత్రం తాజాగా షారుక్, హృతిక్ రికార్డులను మడతపెట్టేసింది. హిందీ సినిమా పరిశ్రమలో క్రియేట్ చేసిన రికార్డుల వివరాల్లోకి వెళితే..
గతంలో భారీ విజయం సాధించిన స్త్రీ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన స్త్రీ 2 చిత్రానికి టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేశారు. శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావ్ రెమ్యునరేషన్లు, ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికంతోపాటు ఈ ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను 60 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ మూవీకి భారీ ఆదరణ ఉండటంతో సుమారుగా 5500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

శ్రద్దాకపూర్ నటించిన ఈ చిత్రం 35వ రోజున కూడా రికార్డు వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం హిందీ సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు షారుక్ నటించిన జవాన్ సినిమా సాధించిన అత్యధిక వసూళ్ల రికార్డును, యానిమల్, హృతిక్ రోషన్ ఫైటర్ లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించింది.
హిందీ సినిమా రంగంలో ఇప్పటి వరకు జవాన్ చిత్రం 584 కోట్ల రూపాయలతో అత్యదిక వసూళ్లు సాధించిన సినిమాగా ఘనతను సాధించింది. తాజాగా స్త్రీ 2 చిత్రం 586 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

స్త్రీ 2 చిత్రం ఓవర్సీస్ కలెక్షన్లు విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలో ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 13 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 19 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో ఈ మూవీ 158 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా 35 రోజుల్లో ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. వరల్డ్ వైడ్‌గా 775 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం 600 కోట్లకు చేరువ కాగా, ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల క్లబ్‌ను దాటేందుకు ఈ మూవీ ప్రయత్నిస్తున్నది. ఇటీవల కాలంలో ఇలాంటి కలెక్షన్లను సునామీని సృష్టించిన సినిమా ఇదే కావడం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











