Stree 2 Day 4 Collections: 4 రోజుల్లో 200 కోట్లు.. శ్రద్దాకపూర్ బాక్సాఫీస్ ఊచకోత.. స్త్రీ 2 కలెక్షన్ల సంచలనం!
బాలీవుడ్ స్టార్ శ్రద్దాకపూర్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ స్త్రీ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నది. 6 ఏళ్ల క్రితం వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అపరాక్షి ఖురానా తదితరులు నటించారు. ఈ సినిమాను అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా, దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.ఈ చిత్రం ప్రీమియర్లతోపాటు గత 4 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందనే వివరాల్లోకి వెళితే..
స్త్రీ 2 చిత్రానికి టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేయగా.. క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా సినిమాను రూపొందించారు. శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావ్ రెమ్యునరేషన్లు, ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికంతోపాటు ఈ ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను 60 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ మూవీకి భారీ ఆదరణ ఉండటంతో సుమారుగా 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇక స్త్రీ 2 చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో.. ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండటంతో రిలీజ్‌కు ఒక రోజు ముందే ప్రీమియర్లను ప్రదర్శించారు. పెయిడ్ ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 9.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక తొలి రోజు మాత్రం రికార్డు స్థాయిలో అంటే..55.5 కోట్లు రాబట్టింది. దాంతో తొలి రోజు 65 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది.
ఇక స్త్రీ 2 మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 2వ రోజు 35 కోట్ల రూపాయలు, మూడో రోజు 45 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లోనే 145 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో ఏ మూవీ కూడా వసూలు చేయని విధంగా రికార్డులు తిరగరాసింది.

ఇక 4వ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో బాక్సాఫీస్ వద్ద శ్రద్దాకపూర్ మూవీ అదే ఊపును జోరును కొననాగించింది. ఈ సినిమా రికార్డు స్థాయిలో 56 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ఇటీవల కాలంలో షారుక్ లాంటి హీరోలు తప్ప ఈ ఘనతను సాదించలేదనే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక స్త్రీ 2 చిత్రం ఓవర్సీస్‌లో కూడా రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం 4 మిలియన్ల డాలర్లు అంటే.. 33 కోట్ల రూపాయలు భారతీయ కరెన్సీలో వసూలు చేసింది. ఈ సినిమా దూకుడు చూస్తే.. ఈ చిత్రం 500 కోట్లు వసూలు చేయడం సునాయసంగా కనిపిస్తున్నది. రెండో రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రం భారీ లాభాల దిశగా అడుగులేస్తున్నది.


Click it and Unblock the Notifications











