Stree 2 Day 5 Collections: స్త్రీ 2 కలెక్షన్ల ఊచకోత.. 5 రోజుల్లో 300 కోట్లు.. ప్రభాస్ రికార్డులు ఫట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటించిన హారర్ , కామెడీ చిత్రం బాక్సాఫీస్‌ను రికార్డులతో షేక్ చేస్తున్నది. 2018లో వచ్చిన స్త్రీ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన స్త్రీ 2 సీక్వెల్‌గా కలెక్షన్ల వర్షం కురుస్తున్నది. ఇండియాలో అగ్ర హీరోల సినిమాలకు మంచి వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం తొలి రోజు, తొలి ఆట నుంచి మొదలైనా బాక్సాఫీస్‌పై జైత్రయాత్ర భారీగా కొనసాగుతున్నది. ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్లు, 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ స్టార్ యాక్టర్లు రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అపరాక్షి ఖురానా తదితరులు నటించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. హిందీ సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలు దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే ఈ చిత్రాన్ని సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమాకు భారీ అంచనాలు ఉండటంతో దాదాపు 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇండియాలో రిలీజ్‌కు ముందు రోజే ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్లతో ప్రదర్శన ప్రారంభించారు. పెయిడ్ ప్రీమియర్లకు సుమారుగా 9 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఇక తొలి రోజు 52 కోట్ల రూపాయలు, రెండో రోజు 31 కోట్ల రూపాయలు, 3వ రోజు 44 కోట్ల రూపాయలు, 4వ రోజు 56 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. దాంతో 190 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఇక సోమవారం రోజున బాక్సాఫీస్ వద్ద స్త్రీ 2 సినిమా ప్రభంజనం కొనసాగింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డు వసూళ్లను నమోదు చేసింది. 5వ రోజున ఈ చిత్రం 37 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. దాంతో ఇండియాలో ఈ సినిమా తొలి 5 రోజుల్లో 227 కోట్లకుపైగా నికరంగా 250 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఓవర్సీస్‌లో స్త్రీ 2 చిత్రం బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నది. ఈ చి త్రం విడుదలైన అన్నీ దేశాల్లో రికార్థు స్థాయి కలెక్షన్లను రాబడుతున్నది. దాంతో గత ఐదు రోజుల్లో ఈ సినిమా 6 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 50 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో కల్కి సాధించిన రికార్డులను అధిగమించింది.
ఇక ఈ చిత్రం ఇండియాలో 250 కోట్ల రూపాయల గ్రాస్, అలాగే ఓవర్సీస్‌లో 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా కేవలం 5 రోజుల్లో 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రం మూడో రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటికే భారీ లాభాలతో దూసుకెళ్తున్నది. ఈ సినిమా త్వరలోనే 500 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











