Stree 2 Day 6 Collections: 350 కోట్ల కలెక్షన్లతో స్త్రీ 2 సంచలనం.. 6వ రోజు ఎన్ని కోట్ల వసూళ్లంటే?

బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావ్ జంటగా తమన్నా భాటియా ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం స్త్రీ 2. అమర్ కౌశిక్ దర్శకత్వంలో నిర్మాతలు దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపరాక్షి ఖురానా కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నది. గత 5 రోజుల్లో బాక్సాఫీస్‌ను కలెక్షన్లతో కుమ్మేసిన ఈ చిత్రం 6వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందంటే?

2018 సంవత్సరంలో రూపొందిన స్త్రీ 2 అనే బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా స్త్రీ 2 సినిమా రూపొందింది. టాప్ యాక్టర్ల రెమ్యునరేషన్లు, పాపులర్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేయడంతో నిర్మాణ వ్యయం భారీగా అయింది. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Stree 2 Day 6 Box Office Collections Worldwide Shraddha Kapoor Movie at 300 crores

స్త్రీ 2 చిత్రం విడుదలకు ముందే పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శించారు. దాదాపు 4500 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 9 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. తొలి రోజు 52 కోట్లు, 2వ రోజు 31.5 కోట్లు, 3వ రోజు 44 కోట్లు, 4వ రోజు 56 కోట్లు, 5వ రోజు 38 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 5 రోజుల్లో ఇండియాలో 225 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది.

శ్రద్దాకపూర్ మూవీ 6వ రోజు మంగళవారం కూడా అదే జోష్‌ను బాక్సాఫీస్ వద్ద కొనసాగించింది. ఈ చిత్రం సుమారుగా 50 శాతం ఆక్యుపెన్సీని ఓవరాల్‌గా సాధించింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, భోపాల్‌లో 50 నుంచి 55 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇక లక్నోలో ఈ సినిమాకు 70 శాతం ఆక్యుపెన్సీ రికార్డు అయింది.

Stree 2 Day 6 Box Office Collections Worldwide Shraddha Kapoor Movie at 300 crores

ఇక స్త్రీ 2 మూవీ తన కలెక్షన్ల జోరును కొనసాగిస్తూ 6వ రోజు కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఇండియాలో 27 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ చిత్రం 252 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టిన హిందీ సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు. 2024 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

ఇక ఓవర్సీస్‌లో కూడా స్త్రీ ప్రభంజనం కొనసాగుతున్నది. ఈ చిత్రం 6 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 50 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అంటే.. ఇండియాలో 275 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 50 కోట్లు కలిపితే.. 325 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రం 7వ రోజున 350 కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X