Stree 2 Day 9 Collections: 450 కోట్లకు చేరువగా స్త్రీ 2.. ప్రభాస్ రికార్డును బ్రేక్ చేసిన శ్రద్దాకపూర్!

బాలీవుడ్ చిత్రం స్త్రీ 2 వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సంచలనం రేపుతున్నది. శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు నటించిన ఈ చిత్రం గత 9 రోజుల వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేస్తున్నది. తమన్నా భాటియా, పంకజ్ త్రిపాఠి, అపరాశక్తి ఖురానా తదితరులు నటించి ఈ చిత్రం 2024 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా 9వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందంటే?

2018 సంవత్సరంలో రూపొందించిన స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా స్త్రీ 2 చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాను 60 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ చిత్రానికి భారీగా ప్రమోషన్స్ చేశారు. టీజర్లు, ట్రైలర్లు భారీ బజ్ క్రియేట్ చేశారు. ఈ మూవీకి భారీ ఆదరణ ఉండటంతో సుమారుగా 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో తొలి రోజు నుంచే రికార్డు కలెక్షన్లను నమోదు చేస్తున్నది.

Stree 2 Day 9 Box Office Collections Worldwide Shraddha Kapoor Movie near to 150 crores

ఇండియాలో స్త్రీ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కురిపిస్తున్నది. కలెక్షన్ల కుండపోతను మరిపిస్తూ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం తొలివారంలో 292 కోట్ల రూపాయల నికరంగా ఇండియాలోనే సాధించింది. తోలివారమే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల పంట పండిస్తున్నది.

ఇక విడుదల తర్వాత ఈ సినిమా రెండో శుక్రవారం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచింది. ఈ చిత్రం ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాదిలో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం 9వ రోజున సుమారుగా 17 కోట్ల రూపాయలు ఇండియాలో కలెక్ట్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలోనే 300 కోట్లకుపైగా నికర వసూళ్లను సాధించి అరుదైన మైలురాయిని దాటింది.

Stree 2 Day 9 Box Office Collections Worldwide Shraddha Kapoor Movie near to 150 crores

ఇక స్త్రీ 2 చిత్రానికి ఓవర్సీస్‌లో కూడా భారీ ఆదరణ లభిస్తున్నది. కేవలం నార్త్ అమెరికాలోనే కాకుండా యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్, గల్ఫ్ దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధిస్తున్నది. ఈ చిత్రం 9 రోజుల్లో 8.2 మిలియన్ల కలెక్షన్లు అంటే.. భారతీయ కరెన్సీలో 69 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 405 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా సాదించింది.

ఇక స్త్రీ 2 చిత్రం ఇతర భాషా, బాలీవుడ్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేస్తున్నది. హిందీ వెర్షన్ కల్కి మూవీ లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించింది. బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల లైప్ టైమ్ కలెక్షన్లను బ్రేక్ చేసింది. ఈ చిత్రం రెండో వారాంతం తర్వాత 500 కోట్ల మైలురాయిని దాటే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: shraddha kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X