400 కోట్లతో స్త్రీ 2 కలెక్షన్ల సంచలనం.. కల్కి లైఫ్ టైమ్ రికార్డు బ్రేక్

బాలీవుడ్‌లో భారీ అంచనాలతో వచ్చిన స్త్రీ 2 చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నది. శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావ్, తమన్నా భాటియా, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించిన ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. ఈ చిత్రం హిందీ సినిమా ట్రేడ్ పండితుల అంచనాలు మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. గత 7 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఏ రేంజ్ లాభాలను సొంతం చేసుకొన్నది అనే వివరాల్లోకి వెళితే..

అమర్ కౌశిక్ దర్శకత్వంలో నిర్మాతలు దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపరాక్షి ఖురానా కీలక పాత్రల్లో నటించారు. 2018 సంవత్సరంలో రూపొందిన స్త్రీ అనే బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా స్త్రీ 2 సినిమా రూపొందింది. టాప్ యాక్టర్ల రెమ్యునరేషన్లు, పాపులర్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేయడంతో నిర్మాణ వ్యయం భారీగా అయింది. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Stree 2 movie breaks Kalki 2898 AD Hindi life time breaks Collections

స్త్రీ 2 చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. రిలీజ్ కంటే ముందే ఒకరోజు ప్రీమియర్లు ప్రదర్శించగా 9 కోట్ల రూపాయల కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఇక తొలి రోజు 52 కోట్లు, రెండో ోరజు 31.5 కోట్లు, మూడో రోజు 44 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 56 కోట్ల రూపాయలు, ఐదో రోజు 38 కోట్ల రూపాయలు, ఆరో రోజు 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. దక్షిణా భారతంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో రికార్డు ఆక్యుపెన్సీ నమోదు చేస్తున్నది. ఇక ఢిల్లీ, ముంబై, లక్నో, భోపాల్ లాంటి నగరాల్లో ఈ సినిమాకు మంచి స్పందన కనిపిస్తున్నది.

ఇక ఏడో రోజు కూడా స్త్రీ 2 చిత్రం భారీగా వసూళ్లను సాధించింది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ చిత్రం కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. గత ఆరు రోజులుగా రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా 7వ రోజు ఇండియాలో 21 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం దేశీయంగా 280 కోట్ల రూపాయలు రాబట్టింది.

Stree 2 movie breaks Kalki 2898 AD Hindi life time breaks Collections

ఇక ఓవర్సీస్‌లో కూడా స్త్రీ 2 చిత్రం వసూళ్లు కుంభవృష్టిని తలపిస్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో రికార్డు కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఇప్పటికే 7 మిలియన్ డాలర్ల కలెక్షన్లను అంటే ఇండియన్ కరెన్సీలో 59 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇంకా స్ట్రాంగ్‌గా వసూళ్లను రాబట్టే అవకాశం స్పష్టంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం 350 కోట్లు నెట్, 372 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ఈ చిత్రం 8వ రోజు 400 కోట్లకు చేరువ అవుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి కలెక్షన్లను ఈ చిత్రం పలు చోట్ల అధిగమిస్తున్నది. హిందీ వెర్షన్ కల్కి మూవీ సాధించిన 275 కోట్ల లైఫ్ టైమ్ కలెక్షన్లను స్త్రీ 2 సినిమా అధిగమించి సరికొత్త రికార్డు సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: stree 2 box office collections
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X