Stree 2 Overseas Collections: ఓవర్సీస్‌లో స్త్రీ 2 సరికొత్త రికార్డు..60 కోట్ల టార్గెట్..ఎన్ని కోట్ల లాభమంటే?
స్త్రీ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నది. ఈ చిత్రం గత 16 రోజులుగా వసూళ్ల కుండపోతను మరిపిస్తున్నది. శ్రద్దా కపూర్ నటించిన ఈ చిత్రం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా రికార్డు కలెక్షన్లను నమోదు చేస్తున్నది. రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అపరాక్షి ఖురానా తదితరులు నటించిన ఈ సినిమాను అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా, దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ చిత్రం గత 16 రోజులుగా సాధించిన కలెక్షన్లు వివరాలు, ఓవర్సీస్ వసూళ్ల వివరాల్లోకి వెళితే...
శ్రద్దా కపూర్ నటించిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా తొలి రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతున్నది. నార్త్ అమెరికా అంటే.. కెనడా, అమెరికాలో ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 6.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో ఈ సినిమా సుమారుగా 60 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

నార్త్ అమెరికా మినహాయిస్తే.. యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ ఇతర దేశాల్లో కూడా భారీగా వసూళ్లు నమోదు చేసింది. ఓవర్సీస్‌లో సినిమా అంచనాలు మించి కలెక్షన్లు రాబట్టింది. గత 16 రోజుల్లో ఈ సినిమా 13.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో ఈ మూవీ సుమారుగా 115 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, ఇండియాలో స్త్రీ 2 చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. ఈ చిత్రం తొలివారం 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండోవారంలో కూడా అదే జోష్‌ను కొనసాగించింది. ఈ చిత్రం 2వ వారంలో 142 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 16వ రోజున ఈ సినిమా 8 కోట్లకుపైగా నమోదు చేసింి. దాంతో ఈ చిత్రం 441 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
స్త్రీ 2 చిత్ం కేవలం 14 రోజుల్లోనే 600 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఈ సినిమా 15వ రోజు 10 కోట్ల రూపాయలు, 16వ రోజు 8 కోట్లకుపైగా వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 620 కోట్ల రూపాయలకు చేరువైంది. త్వరలోనే ఈ సినిమా 650 కోట్ల మైలురాయిని దాటేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. దాదాపు 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీ తొలివారంలోనే భారీ లాభాల్లోకి చేరుకొన్నది. తాజాగా ఈ సినిమా సుమారుగా 300 కోట్ల రూపాయల లాభంతో కొనసాగుతున్నదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ ఇండియన్ సినిమా ఓవర్సీస్‌లో 100 కోట్ల రూపాయలు సాధించడం రికార్డుగా పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











