జాక్‌పాట్ కొట్టేశారు... రూ. 100 కోట్లు వసూలు చేసిన ‘స్త్రీ’, బడ్జెట్ ఎంతో తెలుసా?

రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ హారర్ కామెడీ ఫిల్మ్ 'స్త్రీ' ట్రేడ్ పండితుల అంచనాలను తలక్రిందులు చేస్తూ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. ఆగస్టు 31న విడుదలైన ఈ మూవీ మూడు వారాల్లో రూ. 101.43 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఓ వైపు హాలీవుడ్ హారర్ ఫిల్మ్ 'నన్', అనురాగ్ కశ్యప్ మూవీ 'మన్మర్జియాన్' లాంటి చిత్రాల నుండి పోటీని తట్టుకుని బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటింది. ఈ సినిమా విజయంతో శ్రద్ధా కపూర్ ఖాతాలో మరో రూ. 100 కోట్ల సినిమా పడ్డట్లయింది.

 బడ్జెట్ ఎంతో తెలుసా?

బడ్జెట్ ఎంతో తెలుసా?

‘స్త్రీ' చిత్రాన్ని అమర్ కౌశిక్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేశాడు. నాలే బా అనే గ్రామంలో చోటు చేసుకున్నసంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. పబ్లిసిటీ, అడ్వర్టెజింగ్‌తో కలిపి కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తక్కవ బడ్జెట్‌లో రూపొందిన ఈ మూవీ నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది.

నిర్మాతలకు లాటరీ తగిలిందంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్

‘స్త్రీ' మూవీ రూ. 100 కట్లు వసూలు చేయడంపై తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ.... నిర్మాతలకు ఈ సినిమాతో లాటరీ తగినట్లయిందని వ్యాఖ్యానించారు. మూడో వీక్‌లో కలెక్షన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

శ్రద్ధా కపూర్ రియాక్షన్

శ్రద్ధా కపూర్ రియాక్షన్

‘స్త్రీ' మూవీ రూ. 100 కోట్లు వసూలు చేయడం ఆనందంగా ఉందని, ఏ సినిమా అయినా తనకు కంటెంట్ నచ్చితేనే ఓకే చెబుతాను. ఇప్పటి వరకు చేసిన సినిమాల విషయంలో గర్వ పడుతున్నాను అని వెల్లడించారు.

తర్వాతి సినిమాలు

తర్వాతి సినిమాలు

శ్రద్ధా కపూర్ నటించిన మరో చిత్రం ‘బట్టి గుల్ మీటర్ చాలు' సెప్టెంబర్ 21న విడుదల కాబోతోంది. దీంతో పాటు ఆమె తెలుగులో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సాహో' చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X