జోరుమీదున్న మాస్టర్.. మొదటిరోజే రికార్డ్ క్రియేట్ చేసేలా ఉంది!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సారి విజయ్ తెలుగులో కూడా భారీ స్థాయిలో హిట్ అందుకునేలా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆడియెన్స్ థియేటర్స్ కు చాలా అలవాటు పడ్డట్లు విడుదలైన సినిమాలతో అర్ధమయ్యింది.
సోలో బ్రతుకే సో బెటర్, క్రాక్ సినిమాల కలెక్షన్స్ తోనే సినిమాలకు పెరుగుతున్న ఆదరణపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక మాస్టర్ సినిమాను కూడా అదే నమ్మకంతో తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ గత సినిమాలతో పోలిస్తే మాస్టర్ కు కొంత హై డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. ఇక తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

ఇప్పటికే నైజాం ఏరియాలో మొదటిరోజు సగం థియేటర్స్ హౌజ్ ఫుల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మల్టీప్లెక్స్ లలో అయితే ఆల్ మోస్ట్ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందట.
చూస్తుంటే మాస్టర్ తెలుగు బిజినెస్ టార్గెట్ ను రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. మినిమమ్ 11కోట్లు వచ్చినా ప్రాఫిట్స్ లోకి వచ్చినట్లే. కానీ మాస్టర్ జోరు చూస్తుంటే అంతకంటే ఎక్కువ లాగేలా ఉన్నాడని టాక్ వస్తోంది. మరి మన తెలుగు సినిమాలు ఎంతవరకు పోటీని ఇస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











