Subham Closing Collections: శుభం మూవీ క్లోజింగ్ కలెక్షన్లు.. సమంతకు ఎన్ని కోట్ల లాభమంటే?
తెలుగు, తమిళ, మలయాళ సినిమా రంగాల్లో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిర్మాతగా మారి ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం శుభం. సినిమాబండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెటైరికల్ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ రూపొందిన ఈ సినిమా మే 9వ తేదీన రిలీజైంది. ఈ సినిమా 5 రోజుల్లోనే లాభాల్లోకి ప్రవేశించిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. గత 6 రోజుల్లో ఈ మూవీ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బడ్జెట్ ఎంతంటే?
బుల్లితెర ప్రేక్షకులపై టెలివిజన్ సీరియల్స్ ప్రభావం అనే పాయింట్‌తో సెటైరికల్ రూరల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా సుమారుగా 2 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులు, ఇతర వ్యయాలతో కలిపి (సమంత రెమ్యునరేషన్ మినహాయించి) బడ్జెట్‌ను 3.5 కోట్లుగా రౌండప్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లుగా వాల్యూ కట్టారు. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

సమంత నిర్మాతగా తొలి సినిమా
శుభం సినిమా పెయిడ్ ప్రీమియర్ల ద్వారా పాజిటివ్ బజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాకు మౌత్ టాక్ కూడా కలిసి రావడంతో మెల్లమెల్లగా కలెక్షన్లు పెరిగాయి. కానీ భారీ వసూళ్లను ఈ సినిమా నమోదు చేయలేకపోయింది. అయితే థియేట్రికల్‌గా ఈ చిత్రం మంచి ఫలితాలను సాధించింది. తొలి సినిమాతోనే సమంత భారీ లాభాలను సొంతం చేసుకొన్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇండియాలో కలెక్షన్లు
సమంత నిర్మించిన ఈ సినిమా ఇండియాలో అంటే.. తెలుగు రాష్ట్రాలు, కన్నడ, తమిళం, ఇతర రాష్ట్రాల్లో కలిపి తొలి రోజు 60 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత రెండో రోజు 75 లక్షలు, మూడో రోజు 90 లక్షల రూపాయలు, నాలుగో రోజు 50 లక్షలు, ఐదో రోజు 50 లక్షలు, ఆరో రోజు 50 లక్షలకుపైగా వసూళ్లను సాధించింది. ఇక ఏడో రోజు ఈ సినిమా 40 లక్షలు రాబట్టింది. తొలివారం 4.15 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.
రెండు, మూడు వారాల్లో వసూళ్లు
ఇక రెండు, మూడో వారంలోను ఈ సినిమా నిలకడగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా గత 19 రోజుల్లో సగటున 20 లక్షల రూపాయల చొప్పన కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇప్పటి వరకు 2.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా ఇండియాలో ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో 6.35 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సాక్ నిల్క్ అండ్, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు..
తెలుగు రాష్ట్రాల్లో శుభం సినిమా భారీ లాభాలనే సాధించిందని చెప్పుకోవాలి. నైజాంలో ఈ సినిమా 1.25 కోట్ల రూపాయలు, ఏపీలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సుమారుగా 2.75 కోట్ల రూపాయలు షేర్.. 5.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటి..
ఇండియాలో శుభం చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లో చేరుకొంటే.. నార్త్ అమెరికాలో కూడా మంచి లాభాలను నమోదు చేసింది. ఈ సినిమా అమెరికా, కెనడాలో కలిపి 1.75 రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 8 కోట్ల నెట్, 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. 8 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ఈ సినిమా థియేట్రికల్‌గా సుమారుగా 3 కోట్ల లాభాలను రాబట్టింది. ఇక నాన్ థియేట్రికల్‌గా అంటే.. ఓటీటీ, ఇతర మార్గాల ద్వారా ఈ సినిమా మరో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











