Subham Day 1 Collections: శుభం మూవీకి హిట్ టాక్.. సమంత సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిర్మాతగా మారి ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం శుభం. సినిమాబండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు నటించారు. మే 9వ తేదీన రిలీజైన ఈ సినిమాకు క్రిటిక్స్, ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు పూర్తి వినోదం అందించే సీరియల్స్, వాటి వల్ల ఫ్యామిలీ మెంబర్స్‌పై పడే ప్రభావాన్ని ఓ పాయింట్‌గా తీసుకొని సెటైరికల్‌గా హిలేరియస్ ఫన్‌గా చెప్పిన చిత్రం శుభం. ఈ సినిమాను ప్రవీణ్ కండ్రేగుల మలిచిన విధానం అన్ని వర్గాలను టచ్ చేసేలా ఉండటం ఈ సినిమాకు పాజిటివ్‌గా మారింది. అయితే రూరల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Subham Day 1 expected Box Office

శుభం సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మూవీపై భారీగా క్రేజ్ పెరిగింది. దాంతో ఈ సినిమాకు థియేట్రికల్‌గా కూడా డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. మిగితా ప్రాంతాల్లో ఆయా డిస్టిబ్యూటర్లు ఫ్యాన్సీ రేటుకు హక్కులు సంపాదించుకొన్నారు. దాంతో ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లుగా వాల్యూ కట్టారు.

ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ మూవీకి ఓటీటీ, శాటిలైట్‌కు భారీ ధర పలికింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే లాభాలను సొంతం చేసుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమాపై అంచనాలు కూడా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు తెలిపారు. అయితే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్లు వేయడం వాటికి మంచి రెస్సాన్స్ రావడంతో తొలి రోజు రెస్పెక్టబుల్ కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే.. పాజిటివ్ టాక్‌ కారణంగా మౌత్ టాక్ స్పెడ్ కావడంతో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతున్నది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 50 లక్షల రూపాయల నెట్, 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 75 లక్షల నెట్, 1.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా వారాంతంలో మంచి ఆక్యుపెన్సీని నమోదు చేయగలిగితే త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X