Subham Day 2 Collections: శుభం రెండో రోజు కలెక్షన్లు.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిర్మాతగా మారి ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం శుభం. సినిమాబండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు నటించారు. మే 9వ తేదీన రిలీజైన ఈ సినిమాకు క్రిటిక్స్, ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
శుభం బడ్జెట్ ఎంతంటే?
రూరల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లుగా వాల్యూ కట్టారు. ఈ మూవీపై అంచనాలు కూడా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లకు కూడా మంచి రెస్సాన్స్ లభించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
ఇక శుభం సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో యూత్ ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ చిత్రం నైజాం, ఆంధ్రాలో సుమారుగా 60 లక్షల రూపాయలు నికరంగా, 70 లక్షల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే తొలి రోజు ఆశించిన దాని కంటే తక్కువగా వసూళ్లు నమోదు చేయడం ట్రేడ్ వర్గాల అంచనాలు తప్పినట్టు భావిస్తున్నారు.
ఓవర్సీస్ మార్కెట్‌లో వసూళ్లు
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో భారీగా ప్రభావం చూపించలేకపోయింది. చిన్న చిత్రం కావడం, కొత్త నటీనటులు ప్రేక్షకులను థియేటర్ రప్పించడంలో విఫలం కావడంతో కలెక్షన్లు అంతగా గొప్పగా నమోదు కాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా నార్త్ అమెరికా అంటే యూఎస్, కెనడాలో కలిపి 80K డాలర్లు అంటే.. 70 లక్షల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే వీకెండ్‌లో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని చిత్ర యూనిట్ ఆశాభావంతో ఉంది.
2వ రోజు కలెక్షన్లు
శుభం సినిమా 2వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు రెండో రోజు మొదటి రోజు కంటే ఎక్కువగా ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాకు 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల గ్రాస్, వరల్డ్ వైడ్‌గా 1.5 నుంచి 2 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు.
శుభం లాభాల్లోకి రావాలంటే?
ఇదిలా ఉండగా, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే 2 సినిమా 1.5 కోట్ల రాబట్టగా, రెండో రోజుతో కలిపి 3 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా కలెక్షన్ల వేగం పెంచితే కానీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి రావడం సాధ్యమవుతుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











