Subham Day 3 Collections: నష్టాల్లోనే సమంత మూవీ.. శుభం సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిర్మాతగా మారి ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం శుభం. సినిమాబండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు నటించారు. మే 9వ తేదీన రిలీజైన ఈ సినిమాకు క్రిటిక్స్, ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
శుభం బడ్జెట్ ఎంతంటే?
టెలివిజన్ సీరియల్స్ ప్రభావం అనే పాయింట్‌తో రూరల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లుగా వాల్యూ కట్టారు. ఈ మూవీపై అంచనాలు కూడా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. 8 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ఈ సినిమా కోసం ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్లకు కూడా మంచి రెస్సాన్స్ లభించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు
శుభం సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నప్పటికీ. బాక్సాఫీస్ వద్ద భారీగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా తొలి రోజు 60 లక్షల రూపాయల నెట్, రెండో రోజు 75 లక్షల రూపాయల నెట్ ఇండియా వైడ్‌గా వసూలు చేసిందని సాక్ నిక్ వెబ్ సైట్ తన ట్రేడ్ రిపోర్ట్‌ను వెల్లడించింది. రెండు రోజుల్లో ఈ సినిమా ఇండియాలో 1.35 కోట్ల రూపాయలు రాబట్టింది అని వెల్లడించారు.
2 రోజుల్లో కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
గత రెండు రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రాబట్టిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో ఈ సినిమా 30 లక్షల రూపాయలు, ఏపీలో 45 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు, అలాగే 1.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లు, అలాగే ఓవర్సీస్‌లో కలిపి 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా గత రెండు రోజుల్లో 2 కోట్ల నెట్, 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
3వ రోజు పెరిగిన కలెక్షన్లు
శుభం సినిమాకు వస్తున్న మౌత్ టాక్‌తో రోజు రోజుకు కలెక్షన్లు పెరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా 3వ రోజు తొలి రెండు రోజుల కంటే బెటర్ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ సినిమాకు ఆదివారం సెలవు దినం కలిసి వచ్చింది. ఇక ఈ సినిమా 3వ రోజు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది. మూడో రోజు ఈ సినిమా 1 కోటి రూపాయల నెట్, 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ రిపోర్ట్.
లాభాల్లోకి రావాలంటే?
గత రెండు రోజుల్లో 3.5 కోట్ల గ్రాస్, 2 కోట్ల రూపాయల నెట్ వసూళ్లతో స్టడీగా కలెక్షన్లను రాబడుతున్నది. మూడో రోజు అంచనా ప్రకారం ఈ సినిమా మొత్తంగా 3 కోట్ల నెట్, 5.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని భావిస్తున్నారు. దాంతో ఈ సినిమా ఈ వారం ముగిసే సమయానికి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు మెరుగు పడుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











