Subham Day 4 Collections: సమంత మ్యాజిక్ పనిచేసిందా? శుభం లాభాల్లోకి రావాలంటే?
తెలుగు, తమిళ, మలయాళ సినిమా రంగాల్లో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిర్మాతగా మారి ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం శుభం. సినిమాబండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెటైరికల్ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ రూపొందిన ఈ సినిమా మే 9వ తేదీన రిలీజైంది. ఈ నేపథ్యంలో గత 4 రోజులుగా బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
శుభం బడ్జెట్ ఎంతంటే?
బుల్లితెర ప్రేక్షకులపై టెలివిజన్ సీరియల్స్ ప్రభావం అనే పాయింట్‌తో రూరల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లుగా వాల్యూ కట్టారు. ఈ మూవీపై అంచనాలు కూడా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. 8 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ఈ సినిమా కోసం ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్లకు కూడా మంచి రెస్సాన్స్ లభించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇండియా కలెక్షన్లు
పాజిటివ్ రివ్యూలు, సానుకూలమైన మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా ఓ మోస్తరు కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ఇండియాలో ఈ సినిమా తొలి రోజు 60 లక్షల నికరంగా, 1.4 కోట్లు గ్రాస్, రెండో రోజు 75 లక్షలు నెట్, 1.2 కోట్ల గ్రాస్, మూడో రోజు 90 లక్షలు నెట్, 1.4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో 2.25 కోట్ల నెట్, 4 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదైందని ట్రేడ్ వర్గాలు, సాక్ నిల్క్ డేటా వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు
ఇక తెలుగు రాష్ట్రాల్లో శుభం సినిమా స్లో అండ్ స్టడీ అనే విధంగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా గత మూడు రోజుల్లో నైజాంలో 60 లక్షలు, ఏపీలో 80 లక్షల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1.4 కోట్ల నెట్, 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో ఈ సినిమా 80 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 2.2 కోట్ల నెట్, 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఓవర్సీస్ మార్కెట్‌లో
ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా అంటే కెనడా, యూఎస్ మార్కెట్‌లో ఎక్కువగా వసూళ్లు కనిపించాయి. అమెరికాలో ఈ మూవీ 150K డాలర్లు అంటే.. 1.27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నిర్మాతల లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని అధికారికంగా వెల్లడించారు.
4వ రోజు వసూళ్లు ఎంతంటే?
ఇక సోమవారం రోజున ఈ సినిమా నిలకడగా వసూళ్లను రాబట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. సమంత మ్యాజిక్ ఈ సినిమాకు మెల్లమెల్లగా పనిచేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా 4వ రోజున 45 లక్షల నెట్ 1 కోటి గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా నిర్మాతల లెక్కల ప్రకారం 6.25 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే. ఇంకా 2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రిలీజ్‌కు ముందే లాభాలతో
ఓవరాల్‌గా శుభం సినిమా రిలీజ్‌కు ముందే భారీ లాభాలను నమోదు చేసింది. ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ రైట్స్‌కు భారీ మొత్తాన్ని చెల్లించి జీ సంస్థ చేజిక్కించుకొన్నది. అయితే ఈ సినిమా బడ్జెట్‌ను పోల్చి చూసుకొంటే.. మూవీ విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ అయితే సమంత మ్యాజిక్ పనిచేసినట్టే అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











