Subhedar Collections మరాఠా బాక్సాఫీస్‌పై కత్తిదూసిన శివాజీ మహారాజ్.. కోట్ల వర్షం కురిపిస్తున్న సుబేదార్ మూవీ!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కన్నడ, మరాఠీ, భోజ్‌పురి సినీ పరిశ్రమలు కంటెంట్ ప్రధానమైన సినిమాలతో సత్తా చాటుతున్నాయి. కన్నడలో సినీ పరిశ్రమలో కేజీఎఫ్, కాంతారా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన తర్వాత చిన్న పరిశ్రమల్లో ఆశలు చిగురించాయి. కంటెంట్ బాగుంటే.. సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలా మరాఠీ భాషల్లో కంటెంట్‌తో వచ్చిన చిత్రం సుబేదార్. ఈ సినిమా అనూహ్యంగా, అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను నమోదు చేస్తున్నది. ట్రేడ్ వర్గాలు వెల్లడించిన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సుబేదార్ సినిమా కథ విషయానికి వస్తే.. చత్రపతి శివాజీ పాలనలో జరిగిన భావోద్వేగ సంఘటనలతో హృదయానికి హత్తుకునేలా రూపొందించారు. ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించే సన్నివేశాలు, డైలాగ్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. శివాజీ మహారాజుగా చిన్మయ్ మండ్లేకర్, రాజమాత జిజియాగా మృణాల్ కులకర్ణి ప్రధాన పాత్రలో నటించారు. శివాజీ, తానాజీ మధ్య సంబంధాలను కళ్లకుకట్టినట్టుగా చూపించడం సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారిందని చెప్పుకొంటున్నారు. స్వరాజ్య స్థాపన కోసం జరిగిన యుద్దాలు, అంతర్గత మధనం కథగా ఈ సినిమా రూపొందింది.

సుబేదార్ సినిమా కేవలం కంటెంట్ ప్రధానంగానే కాకుండా టెక్నికల్‌గా చాలా రిచ్‌గా తెరకెక్కించడం గమనార్హం. కథ, కథనాలతోపాటు పలు కోణాల్లో స్టోరిని భావోద్వేగంగా నడిపించడం అందర్నీ ఆకట్టుకొంటున్నది. మరాఠీ భాషలోని తియ్యదాన్ని అందరికి పంచేలా సంభాషణలు రాయడంతో ఈ సినిమా ప్రాంతీయంగా విశేషంగా ఆలరిస్తున్నది.

సుబేదార్ సినిమాను మరాఠీ భాషలో సినిమా నిర్మాణాన్ని పోల్చుకొంటే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను టాప్ క్లాస్‌గా రూపొందించడానికి సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు. మరాఠీలో గతంలో ఎన్నడూ లేని విధంగా 250 స్క్రీన్లలో రిలీజ్ చేసి.. రోజుకు 1000 షోలు ప్రదర్శిస్తున్నారు.

సుబేదార్ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే భారీ కలెక్షన్లను నమోదు చేసింది. కేవలం మహారాష్ట్రాలోని మరాఠీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అధికంగా ప్రదర్శిస్తున్న ఈ చిత్రం తొలి రోజు 1.15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు మౌత్ టాక్ పాజిటివ్‌గా స్ప్రెడ్ కావడంతో 1.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో రోజు మరింత జోష్‌ను కనబరిచి 2.25 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో తొలివారాంతంలో 5.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక నాలుగో రోజు సోమవారం వర్కింగ్ డే రోజున కూడా అదే జోష్‌ను చూపించింది. ఈ సినిమా నాలుగో రోజున సుమారు 1 కోటి రూపాయలు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో ఈ చిత్రం నాలుగు రోజుల్లో 6 కోట్ల మేర కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుండటం విశేషంగా మారింది. మరాఠీ బాక్సాఫీస్ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన 6వ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











