Maa Nanna Superhero Collections: సుధీర్ బాబు మూవీ హిట్టా? ఫట్టా?

Maa Nanna Superhero Collections: హీరో సుధీర్ బాబు (Sudheer Babu) నటించిన మూవీ 'మా నాన్న సూపర్ హీరో'(Maa Nanna Superhero). ఈ మూవీ దసరా కానుకగా అక్టోబ‌ర్ 11న రిలీజైంది. తండ్రి కొడుకుల అనుబంధాన్ని ప్రధాన కథాంశంగా డైరెక్టర్ అభిలాష్ కంక‌ర మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరో సుధీర్‌బాబుతో పాటు షాయాజీ షిండే, సాయిచంద్ లీడ్ లో నటించారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే.. బాక్సాఫీస్ ఎంత కలెక్షన్లు వసూళ్లు చేసిందో ఓ లూక్కేద్దాం..

సొంత తండ్రి, ద‌త్త‌త తండ్రి మధ్య ఓ కొడుకు ప్ర‌యాణం ఎలా సాగింద‌నే పాయింట్‌తో మా నాన్న సూపర్ హీరో మూవీని తెర‌కెక్కించాడు. ఈ మూవీని 'వి సెల్యులాయిడ్స్, కామ్ ఎంటర్టైన్మెంట్ సంస్థల పై సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించారు. దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రీకొడుకుల అనుబంధంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా.. క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదనే చెప్పాలి.

Sudheer Babu Abhilash Kankara combo movie Maa Nanna Super Hero box office Collections

వాస్తవానికి రజనీకాంత్ 'వేట్ట‌య‌న్‌', గోపిచంద్ 'విశ్వం' ఒకే సారి రిలీజ్ కావడంతో సుధీర్ బాబు మూవీ 'మా నాన్న సూప‌ర్ హీరో' మూవీకి థియేట‌ర్లు సరిగా దొర‌క‌లేదనే చెప్పాలి. మ‌రోవైపు ఈ సినిమా విడుదలకు ముందు కూడా అంతా అంచనాలు ఏం క్రియేట్ కాదు. అలాగే.. ప్రచారంపై కూడా అంతగా ఫోకస్ చేయలేదని చెప్పాలి.

కలెక్షన్ల పరంగా చూస్తే.. మూవీ తొలి రోజు కేవలం రూ. 19 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. పాజిటివ్ టాక్ రావడంతో కాస్తా డిసింట్ కలెక్షన్లు చేసింది. రెండవ రోజు రూ. 26 లక్షలు వసూలు చేసింది. ఇక మూడవ రోజు రూ. 23 లక్ష్లలు వసూలు చేసింది. ఇక నాలుగవ రోజు మా నాన్న సూపర్ హీరో సినిమా కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోయాయి. నాలుగో రోజు రూ. 6 లక్షలు మాత్రమే పడిపోయాయి. ఐదవ రోజు కలెక్షన్లలో కాస్త పెరుగుదల కనిపించింది. ఈ మూవీ దాదాపు రూ. 12 లక్షలు వరకూ వసూలు చేసినట్టు సమాచారం.

Sudheer Babu Abhilash Kankara combo movie Maa Nanna Super Hero box office Collections

ఇలా ఈ ఐదు రోజుల్లో మా నాన్న సూపర్ హీరో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 0.95 కోట్లు గ్రాస్ లేదా 0.86 కోట్లు (నెట్ ) కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్లు చూస్తే.. చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా మాత్రం మా నాన్న సూపర్ హీరోకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

వాస్తవానికి 'మా నాన్న సూపర్ హీరో' మూవీకి రూ.4.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే.. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలన్న కనీసం రూ.5 కోట్లు కలెక్ష్ చేయాలి. సుధీర్ బాబు సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 5 కోట్ల పైగా షేర్ అయినా అందుకోవాలి. కానీ ఈ ఐదు రోజుల కలెక్షన్లు చూస్తే మాత్రం.. ఇక కష్టమేననీ చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X