Hunt Closing collections: సుధీర్ బాబు యాక్షన్ సినిమాకు ఊహించని నష్టం.. మరీ ఇంత దారుణామా?
మహేష్ బాబు బావ సుధీర్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అతను మొదటి నుంచి కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేయకుండా డిఫరెంట్ కంటెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల యాక్షన్ ప్రేక్షకులను కూడా ఎక్కువగా ఆకట్టుకోవడానికి హంట్ అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో నష్టాలను కలిగించింది. పెట్టిన పెట్టుబడికి కనీసం ఒక 10% కూడా వెనక్కి రాలేదు. మొత్తంగా క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలలోకి వెళితే..

హంట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
సుధీర్ బాబు గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద డిఫరెంట్ గా ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ సరైన విజయాలు మాత్రం రావడం లేదు. ఇక ఈసారి డిఫరెంట్ పోలీస్ గెటప్ లో కనిపించి ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకోవాలని అనుకున్నాడు. మహేష్ సురపనేని దర్శకత్వంలో వచ్చిన హంట్ సినిమాను జనవరి 26న విడుదల చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 6.20 కోట్ల టార్గెట్ తో అడుగుపెట్టింది.

మిడియం రేంజ్ స్టార్ క్యాస్ట్
ఈ సినిమాలో మీడియం రేంజ్ తరహాలో ఒక మంచి కాస్ట్ ఉండేలా చూసుకున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్ ఒక ప్రత్యేకమైన రోల్ లో నటించగా మరో తమిళ నటుడు భరత్ కూడా ఇందులో పవర్ఫుల్ పాత్రలో నటించాడు. ఇక సినిమాకు మొదటి రోజే ఊహించని విధంగా నెగిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. అయితే తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు.

షోలు క్యాన్సిల్ చేశారు
అయితే సుధీర్ బాబు అనుకున్నట్టుగా ఈ సినిమా అంతగా పాజిటివ్ టాక్ అందుకోలేదు. నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా రివ్యూలు కూడా చాలా వరకు నెగటివ్ గా వచ్చాయి. దీంతో సినిమాకు మొదటి రోజే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ప్రమోషన్స్ ఎంత చేసినా కూడా అంతగా హెల్ప్ కాలేదు. దీంతో మొదటి రోజు ఈ సినిమా ధియేటర్లు ఖాళీగా కనిపించాయి. ఇక జనాలు కొన్ని ఏరియాలలో రాకపోవడంతో షోలు క్యాన్సల్ చేయాల్సి వచ్చింది.

ఏపీ తెలంగాణ కలెక్షన్స్
ఇక మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేకపోయింది. వీకెండ్ తర్వాత చాలా వరకు థియేటర్లు తగ్గిపోయాయి. ఇక మొత్తంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే నైజాం ఏరియాలో అయితే కేవలం 28 లక్షల షేర్ మాత్రమే రాగా సిడెట్లో మాత్రం 11 వేలు మాత్రమే వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా ఈ సినిమాకు 58 లక్షల షేర్ మాత్రమే వచ్చాయి.

మొత్తం కలెక్షన్స్
రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే ఎక్కడా కూడా పెద్దగా కలెక్షన్స్ వచ్చిన అప్డేట్స్ అయితే రాలేదు. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ప్రీవియర్స్ తర్వాత కూడా ఎక్కువ షోలు పడలేదు. మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందుకున్న కలెక్షన్స్ చూసుకుంటే కేవలం 61 లక్షలు మాత్రమే అని తెలుస్తోంది.

నష్టాలు ఎంతంటే..
సుధీర్ బాబు ఇంతకుముందు కూడా ఊహించిన విధంగా కొన్ని డిజాస్టర్స్ అందుకున్నాడు. కానీ హంట్ సినిమా మాత్రం కనీసం కోటి రూపాయల షేర్ కూడా అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 6.20 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కేవలం 60 లక్షల షేర్ మాత్రమే రావడంతో సినిమా దాదాపు ఐదున్నర కోట్ల వరకు నష్టాలను కలిగించింది. అంటే పెట్టిన పెట్టుబడికి కనీసం 10% కూడా వెనక్కి తీసుకురాలేక డిజాస్టర్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











