twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'భలే మంచిరోజు' విడుదల తేదీ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: సుధీర్‌ బాబు, వామిఖ జంటగా నటించిన 'భలే మంచిరోజు' చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సన్నీ ఎం.ఆర్‌ అందించిన స్వరాలకి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.

    సుధీర్‌ బాబు హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భలే మంచిరోజు'. ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై విజయ్‌, శశి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ని ఆడియో విడుదల జరిగిన సందర్బంగా నిర్మాతలు విడుదల చేసారు. ఈ ట్రైలర్ చాలా ఆసక్తిగా సాగింది. మీరూ ఓ లుక్కేయండి.

    Sudheer Babu's Bhale Manchi Roju gets a release date

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    'ప్రేమ కథా చిత్రం', సుధీర్‌ బాబు హీరోగా, వామిఖ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. ఈ చిత్రం కథాంశం అంతా ఒక్క రోజులో జరిగేది. ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో, వినోద భరితంగా తెరకెక్కుతోంది.

    70ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజరు కుమార్‌ రెడ్డి, శశిథర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌ ఆధిత్యని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'ఉత్తమ విలన్‌', 'విశ్వరూపం2' చిత్రాలకి ఛాయాగ్రహణం అందించిన షామ్‌దత్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందించారు. సన్ని.ఎమ్‌.ఆర్‌ ఈ చిత్రానికి బాణీలు అందించారు.

    నిర్మాతలు మాట్లాడుతూ '' ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న సబ్జెక్ట్‌ అనుకున్నట్టుగానే తెరకెక్కించాం. సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించారు. కథ, కథనాలని నమ్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సుధీర్‌ బాబు పరకాయ ప్రవేశంలా ఇన్‌వాల్వ్‌ అయ్యి మరీ నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది'' అని అన్నారు.

    కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌. ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, పి.ఆర్‌.వో- ఏలూరు శ్రీను, కో-డైర‌క్ట‌ర్- శ్రీరామ్‌ రెడ్డి, నిర్మాత‌లు-విజ‌య్‌కుమార్ రెడ్డి, శ‌శిధ‌ర్ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం- శ్రీరామ్ ఆదిత్య‌.

    English summary
    Actor Sudheer Babu's Bhale Manchi Roju will be released on the 25th of December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X