మహేష్ బావ 'ఎస్.ఎమ్.ఎస్'సెన్సార్ కట్స్
మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా ఆ మధ్యన 'ఎస్.ఎమ్.ఎస్' (శివ మనసులో శ్రుతి)అనే చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. తాతినేని సత్య దర్శకత్వంలో వేగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాన విక్రమ్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రెజీనా, రోహిణి, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రధారులుగా చేసిన ఈ ఎస్.ఎమ్.ఎస్. చిత్రాన్ని చూసి 4 కట్స్‌తో తలిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు చూడాలంటూ 8-2-12న 'యుఎ' సర్టిఫికెట్‌ని 'ఇసి' జారీ చేసింది.
ఈ చిత్రంలోని సెన్సార్ కట్స్ ఇలా ఉన్నాయి...
1. మద్యపానం, ధూమపానంకి సంబంధించిన చట్టబద్ధమైన హెచ్చరికను ఆయా సన్నివేశాలు వున్నప్పుడు చూపమన్నారు.
2. చిత్రంలో 'నీ యమ్మ', 'నీ తల్లి', 'నీ యబ్బ', 'నా కొడకా', 'దొంగ ముండా', 'రాక్షసి ముండా', 'పీకుతున్నావు', 'పీక్కో', 'మాముల్', 'ఫస్ట్ సెక్స్', 'పడుకుంటావా', 'నిత్యానంద', 'చిరంజీవి' పదాలు ఎక్కడ వున్నా వాటిని తొలగించారు.
మూడు నాలుగు రీళ్ళలో:
3. ''శనిదేవుడి సెకండ్ సెటప్'' వాక్యం కత్తెర పాలైంది.
4. 'గోల్డ్‌ఫ్లేక్ సిగరెట్ ప్యాకెట్' బ్రాండ్ నేమ్‌ని బ్లర్ చేయమన్నారు.
4061.97 మీటర్ల నిడివిగల 'ఎస్‌ఎమ్‌ఎస్' చిత్రం 10-2-12న విడుదలైంది.
ఇక ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. హీరోగా సుధీర్ బాబుని లాంచ్ చేయగలిగింది కానీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. సుధీర్ బాబు తన తదుపరి చిత్రాన్ని రక్ష దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్లతో ప్రారంబించారు. అలాగే హీరోయిన్ రెజీనాకి సైతం ఈ చిత్రం మంచి పేరు,ఆఫర్స్ తెచ్చిపెట్టింది. యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం సుధీర్ బాబుకి లాంచింగ్ చిత్రంగా కాక మరిదేనికి పనికిరాలేదు.


Click it and Unblock the Notifications











