Harom Hara 2 Days Collections: సుధీర్ బాబు మాస్ కుమ్ముడు.. 2 రోజుల్లో అన్ని కోట్లతో అరాచకం
పెద్ద సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్నాడు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. ఆరంభం నుంచీ తనదైన చిత్రాలతో ప్రయోగాలు చేస్తోన్న అతడు.. విజయాన్ని మాత్రం సొంతం చేసుకోవడం లేదు. దీంతో ఈసారి ఎలాగైనా బిగ్ హిట్ కొట్టాలన్న కసితో 'హరోం హర' మూవీ చేశాడు. ఈ చిత్రం ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి శనివారం కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో 'హరోం హర' మూవీ రెండు రోజుల వసూళ్లను మీరే చూడండి!
ఊరమాస్ స్టోరీతో సుధీర్
సుధీర్ బాబు హీరోగా నటించిన ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ సినిమానే 'హరోం హర'. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించగా.. సునీల్, జయప్రకాశ్ కీలక పాత్రలు చేశారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి మ్యూజిక్‌ను అందించాడు.

సుధీర్ మూవీకి బిజినెస్
చాలా కాలంగా భారీ హిట్ కోసం ఎదురు చూస్తోన్న సుధీర్ బాబు నటించిన చిత్రమే 'హరోం హర'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 6.00 కోట్లు వరకూ బిజినెస్ చేసుకుంది.
2వ రోజు ఎంత వచ్చింది
జ్ఞానసాగర్ ద్వారక రూపకల్పనలో సుధీర్ బాబు హీరోగా నటించిన 'హరోం హర' చిత్రానికి మొదటి రోజు టాక్ డీసెంట్‌గా రావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు కూడా ఇది బాగానే హోల్డ్ చేయగలిగింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 60 లక్షలు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి ఈ సినిమా రూ. 70 లక్షలు రాబట్టింది.

2 రోజులకు కలిపి ఎంత
ఫుల్ లెంగ్త్ మాస్ స్టోరీతో రూపొందిన 'హరోం హర' సినిమాకు రెండు రోజుల్లో భారీ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఫలితంగా ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.20 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 1.55 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. తద్వారా సుధీర్ బాబు కెరీర్‌లో మంచి వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో చేరింది.


Click it and Unblock the Notifications











