Harom Hara 4 Days Collections: హరోం హర టాక్ ఒకలా వసూళ్లు మరోలా.. సుధీర్ బాబు ఎన్ని కోట్లు కొట్టాడంటే!

సినిమాల ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న హీరోల్లో సుధీర్ బాబు ఒకడు. మహేశ్ బాబు బావగా సినీ రంగంలోకి ఎంటరైన అతడు.. ఆరంభం నుంచే తనదైన చిత్రాలతో అలరిస్తున్నాడు. కానీ, పెద్దగా విజయాలను మాత్రం అందుకోవడం లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని 'హరోం హర' మూవీ చేశాడు. ఈ చిత్రానికి టాక్ బాగున్నా వసూళ్లు పెద్దగా రావడం లేదు. సోమవారం హాలీడే అయినా డౌన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో 'హరోం హర' మూవీ నాలుగు రోజుల వసూళ్లను మీరే చూడండి!

Sudheer Babu Starrer Harom Hara Movie 4 Days Official Box Office Collections

డిఫరెంట్ యాక్షన్ మూవీ
టాలెంటెడ్ గాయ్ సుధీర్ బాబు హీరోగా నటించిన డిఫరెంట్ యాక్షన్ సినిమానే 'హరోం హర'. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించగా.. సునీల్, జయప్రకాశ్ కీలక పాత్రలు చేశారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.

Sudheer Babu Starrer Harom Hara Movie 4 Days Official Box Office Collections

సుధీర్ మూవీకి బిజినెస్
ఎన్నో ఏళ్లుగా విజయానికి దూరంగా ఉన్న సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీనే 'హరోం హర'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 6.00 కోట్లు వరకూ బిజినెస్ చేసింది.

4వ రోజు ఎంత వచ్చింది
జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వలో సుధీర్ బాబు హీరోగా నటించిన 'హరోం హర' చిత్రానికి మొదటి రోజు టాక్ డీసెంట్‌గా రావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, ఇది ఆశించిన రీతిలో వసూళ్లను రాబట్టడం లేదనే చెప్పాలి. ఇలా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 35 లక్షలు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 40 లక్షలు మాత్రమే రాబట్టింది.

Sudheer Babu Starrer Harom Hara Movie 4 Days Official Box Office Collections

4 రోజులకు కలిపి ఎంత
పూర్తి స్థాయి మాస్ స్టోరీతో రూపొందిన 'హరోం హర' సినిమాకు నాలుగు రోజుల్లో మోస్తరు రెస్పాన్స్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఫలితంగా ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.09 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 2.42 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. దీంతో విజయానికి ఇంకా చాలా దూరంలోనే ఉండిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X