Harom Hara Day 1 Collections: సుధీర్ బాబు మూవీకి ఊహించని వసూళ్లు.. హరోం హర డే 1 కలెక్షన్లు ఎంతంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్రంగా కష్టపడుతోన్న హీరోలు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో సుధీర్ బాబు ఒకడు. మహేశ్ బాబు బావగా పరిచయం అయిన అతడు.. సినిమా కథల ఎంపిక నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా అతడు విజయాలను మాత్రం అందుకోవడం లేదు.
ఈ పరిస్థితుల్లో ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో 'హరోం హర' అనే మూవీ చేశాడు. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం రిలీజ్ అయింది. దీనికి మొదటి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో 'హరోం హర' మూవీ మొదటి రోజు వసూళ్లను మీరే చూడండి!

హరోం హర అంటూ సుధీర్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటించిన ఊరమాస్ సినిమానే 'హరోం హర'. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించగా.. సునీల్, జయప్రకాశ్ కీలక పాత్రలు చేశారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.
సుధీర్ సినిమాకు బిజినెస్
సుదీర్ఘ కాలంగా విజయం కోసం ఎదురు చూస్తోన్న సుధీర్ బాబు నటించిన చిత్రమే 'హరోం హర'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 6.00 కోట్లు వరకూ బిజినెస్ జరుపుకుంది.
డీసెంట్ టాక్‌తో రెస్పాన్స్
ఊరమాస్ యాక్షన్ స్టోరీతో రూపొందిన 'హరోం హర' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే అంటే బాగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే కంటే మంచి వసూళ్లు వస్తాయని టాక్ వినిపించింది.
మొదటి రోజు ఎంతంటే
జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన 'హరోం హర' సినిమాకు మొదటి రోజు టాక్ డీసెంట్‌గా రావడంతో ప్రేక్షకులను రప్పించడంలో ఈ చిత్రం బాగానే సక్సెస్ అయిందని చెప్పాలి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 60 లక్షలు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి ఈ సినిమా రూ. 70 లక్షలు రాబట్టింది.


Click it and Unblock the Notifications











