Harom Hara Business: సుధీర్ బాబు మూవీకి భారీ బిజినెస్.. ఒక్క హిట్ లేకున్నా అన్ని కోట్లా!
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకునేందుకు తెగ కష్టపడుతోన్నాడు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలతో మెప్పించిన అతడు.. సత్ఫలితాలను మాత్రం పెద్దగా రాబట్టలేదు. అయినప్పటికీ ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సుధీర్ బాబు 'హరోం హర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌పై ఓ లుక్కేద్దాం పదండి!
హరోం హర అంటోన్న సుధీర్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రమే 'హరోం హర'. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించగా.. సునీల్, జయప్రకాశ్ కీలక పాత్రలు చేశారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

అలాంటి కథ.. ఫుల్ మాస్‌తో
ఓ సాధారణ కుర్రాడు గన్ స్మగ్లర్‌గా మారడం.. తర్వాత అదే ప్రొఫెషన్ చేసుకుని మాఫియా డాన్‌గా ఎదగడం అనే కాన్సెప్టుతో తెరకెక్కిన సినిమానే 'హరోం హర'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ఆరంభంలోనే అందరి దృష్టి పడింది. అందుకు అనుగుణంగానే ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ప్రమోషన్స్‌తో సందడిగానే
పూర్తి స్థాయి మాస్ స్టోరీతో రూపొందిన 'హరోం హర' సినిమాను జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లు, ఇంటర్వ్యూలు కూడా జరిగాయి. వీటన్నింటికి ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్ కూడా లభించిందనే చెప్పుకోవాలి.

హరోం హర షాకింగ్ బిజినెస్
సుధీర్ బాబు హీరోగా నటించిన 'హరోం హర' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమా రూ. 5 కోట్లు బిజినెస్ జరుపుకుంది. అలాగే, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 6 కోట్లు మేర బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
అన్ని కోట్లు వస్తేనే సక్సెస్
సుధీర్ బాబు ఈ మధ్య కాలంలో హిట్ కొట్టలేదు. అయినప్పటికీ 'హరోం హర' మూవీకి బిజినెస్ రికార్డు స్థాయిలోనే జరిగింది. ఇక, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 6.00 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6.50 కోట్లుగా నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

అన్ని థియేటర్లలో రిలీజ్
సుధీర్ బాబు 'హరోం హర' మూవీకి ఓవరాల్‌గా థియేటర్లు మంచిగానే లభించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాం, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 450 థియేటర్లలో విడుదల కాబోతుంది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఏరియాలను కలిపి ప్రపంచ వ్యాప్తంగా 600 వరకూ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











