‘సుడిగాడు’ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ అదిరాయ్
హైదరాబాద్: కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా రూపొందిన 'సుడిగాడు' చిత్రం ఓపెనింగ్స్ అదిరాయి. యూఎస్ఏ బాక్సాఫీసు వివరాల్లోకి వెళితే ఈచిత్రానికి ఇక్కడ ఇటీవల వచ్చిన స్టార్ హీరోల సినిమాకంటే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇటీవల విడుదలైన దేవుడు చేసిన మనుషులు, ఓనమాలు, అధినాయకుడు, ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రాలతో పోలిస్తే....సుడిగాడు చిత్రానికి తొలి రెండు రోజుల్లో వాటికంటే బెటర్ రెస్పాన్స్ వచ్చింది.
యూఎస్ ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం గురు, శుక్రవారాల్లో ఈచిత్రం రూ. 24.55 లక్షలు($ 44,255) వసూలు చేసింది. దీంతో ఇటీవల బెస్ట్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన తెలుగు చిత్రాల వరుసలో 'సుడిగాడు' కూడా చేరాడు. ఇటీవలి కాలంలో జులాయి, గబ్బర్ సింగ్, ఈగ చిత్రాలు మినహా ఇతర తెలుగు చిత్రానికి సరైన స్పందన రాలేదు.
రవితేజ దేవుడు చేసిన మనుషులు అమెరికాలో 29 స్క్రీన్లలో విడుదలై తొలి రోజు రూ. 3.48 లక్షలు ($ 6,288) వసూలు చేయగా...ఓనమాలు చిత్రం తొలి వీకెండ్‌లో రూ. 1.80 లక్షలు ($ 3,243) కలెక్ట్ చేసింది. ఇక బాలయ్య అధినాయకుడు చిత్రం తొలి రోజు రూ. 5.45 లక్షలు ($9,844) రాబట్టింది. వీటితో పోలిస్తే సుడిగాడు చిత్రానికి వచ్చి ఓపెనింగ్స్ చాలా ఎక్కువ.
మరో వైపు సుడిగాడు చిత్రం ఇండియాలో కూడా 70% నుంచి 90% ఆక్యుపెన్సీతో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. టాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో రూ. 5 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది.
అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో చంద్రమోహన్, అలీ, బ్రహ్మానందం, షాయాజీషిండే, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, వేణుమాధవ్, జీవా, కృష్ణ్భగవాన్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సంగీతం: శ్రీవసంత్, పాటలు: సిరివెనె్నల, చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, కెమెరా: విజయ్ ఉలగనాథ్, ఎడిటింగ్: గౌతంరాజ్, నిర్మాత: డి.చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.


Click it and Unblock the Notifications











