బాలయ్యను ఓవర్ టేక్ చేసిన అల్లరి నరేష్!

By Bojja Kumar

హైదరాబాద్: సుడిగాడు చిత్రంతో సడెన్ స్టార్‌గా మారిన టాలీవుడ్ అల్లరోడు అల్లరి నరేష్ టాప్ హీరోలను సైతం ఓవర్ టేక్ చేస్తూ దూసుకెలుతున్నాడు. యూఎస్‌ఏ బాక్సాఫీస్ రిపోర్టు ప్రకారం అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' చిత్రం..బాలయ్య నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రాన్ని కలెక్షన్ల పరంగా వెనక్కు తోసేసి దూసుకెలుతోంది.

ఆగస్టు 24న విడుదలైన'సుడిగాడు' చిత్రం జోరుకు.... ఆగస్టు 30న విడుదలైన 'శ్రీమన్నారాయణ' చిత్రం బ్రేక్ వేస్తుందని భావించారు ట్రేడ్ వర్గాలు. అయితే పరిస్థతి రివర్స్ అయింది. సుడిగాడు జోరును ఆపక పోగా....సుడిగాడు స్పీడుకు వెనక పడిపోయింది 'శ్రీమన్నారాయణ'. 16 స్క్రీన్లలో విడుదలైన శ్రీమన్నారాయణ ఇప్పటి వరకు రూ. 9.41 లక్షలు మాత్రమే($16,938) మాత్రమే వసూలు చేసింది.

లాస్ట్ వీక్ రిలీజైన్ సుడిగాడు చిత్రం కంటిన్యూస్‌గా అమెరికా తెలుగు ప్రేక్షకులు వినోదం పంచుతోంది. ఇక్కడ 19 స్క్రీన్లలో విడుదలైన ఈచిత్రం $51,210 కలెక్ట్ చేసింది. యావరేజ్‌గా ఒక్కో స్క్రీన్‌కి $2,695 వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 11 రోజుల్లో రూ. 1.04 కోట్లు($1,87,570) వసూలు చేసింది.

ఇక ఆగస్టు 8న రిలీజైన్ అల్లు అర్జున్ 'జులాయి' చిత్రం ఇప్పటికీ కొత్త మూవీలకు టఫ్ కాంపిటషన్ ఇస్తోంది. 4వ వీకెండ్‌లో జులాయి చిత్రం 8 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ..$17,276 వసూలు చేసింది. టోటల్‌గా 'జులాయి' చిత్రం ఇప్పటి వరకు రూ. 4.57 కోట్లు($8,22,541) వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X