twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: అల్లరి నరేష్ 'సుడిగాడు' కొత్త రికార్డు

    By Srikanya
    |

    హైదరాబాద్: అల్లరి నరేష్ కొత్త చిత్రం 'సుడిగాడు'ట్రైలర్స్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ తో ఓవర్ సీస్ బిజినెస్ లో అల్లరి నరేష్ కెరీర్ లో ఇంతవరకూ లేని కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. నలభై ఐదు లక్షలకు ఈ చిత్రాన్ని అమ్మినట్లు సమాచారం. అదే విధంగా ఆంధ్రాలోని ఏరియా వైజ్ బిజనెస్ కూడా మంచి రేటు పలుకుతోందని తెలుస్తోంది. ఇది నిర్మాతకు మంచి ఆనందం కలిగించే విషయం. పవన్ కళ్యాణ్,వెంకటేష్ వంటి స్టార్స్ ని డైరక్ట్ చేసిన బీమినేని తొలిసారిగా అల్లరి నరేష్ ని డైరక్ట్ చేసి బిజినెస్ కు హైప్ తెచ్చారు.

    ఇక తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. పాటలు ఈ నెలలో నే విడుదల చేస్తారు. 'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు.

    ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మక చిత్రాల్లో ఇదొక వైవిధ్యమైన ప్రయత్నం. విజయవంతమైన చిత్రాల్లోని పలు సన్నివేశాల పేరడీతో కథ సాగుతుంది. ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తుంది. ఇటీవలే కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కించాం. అసలు ఈ కథలో సుడిగాడు ఎవరు? అతని కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఇందులో నరేష్‌ నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది''అన్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో ఈ చిత్రం మరో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమినేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

    పింకి పింకి పోంకి ఫాదర్ హేడ్ ఎ డాంకీ అంటూ అల్లరి నరేష్ పాడుతున్నారు. తన తాజా చిత్రం 'సుడిగాడు'కోసం ఆయన స్వయంగా ఈ పాటను పాడారు. మొత్తం ఓ ఫ్యామిలీ సాంగ్ గా ఈ పాట తెరకెక్కుతోంది. చంద్రమోహన్‌, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్‌. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌.డి.రెడ్డి నిర్మాత.

    English summary
    Allari Naresh's market value has increased with Sudigaadu movie. Sudigadu has fetched Rs 45 lakhs for overseas market for the film's producers. This has happened for the first in Allari Naresh's career. The film is a spoof on all the mass Telugu films and superstars.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X