Gaalodu Collections: సుధీర్ సంచలన రికార్డు.. ఆదివారం అరాచకంగా.. టోటల్ కలెక్షన్లు చూశారంటే!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో టాలెంట్ ఉన్న కుర్రాళ్లు చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అలా కొన్నేళ్ల క్రితం వచ్చి.. బుల్లితెరపై హవాను చూపించి.. స్టార్ ఎదిగిన వాడే సుడిగాలి సుధీర్. చాలా రోజుల క్రితమే సినిమాల్లోకి కూడా వచ్చిన ఈ కుర్రాడు.. హీరోగా మాత్రం పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ వరుస చిత్రాలతో వస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సుడిగాలి సుధీర్ 'గాలోడు' అనే సినిమాతో హీరోగా మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. దీనికి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 10 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

గాలోడుగా సుధీర్ అరాచకం
టాలెంటెడ్ గాయ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'గాలోడు'. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఇందులో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

గాలోడు బిజినెస్ వివరాలు
బుల్లితెరపై హవాను చూపిస్తోన్న సుడిగాలి సుధీర్.. సినిమాల్లో హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో అతడికి మార్కెట్ రాలేదు. కానీ, 'గాలోడు' మూవీపై మాత్రం ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అంటే దాదాపు రూ. 6 కోట్లు గ్రాస్ మేర వసూలు చేయాలని సమాచారం.

10వ రోజు ఎంత వచ్చింది?
'గాలోడు' తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతోంది. ఫలితంగా తొలి రోజు రూ. 1.21 కోట్లు గ్రాస్, 2వ రోజు రూ. 1.14 కోట్లు, 3వ రోజు రూ. 1.61 కోట్లు, 4వ రోజు రూ. 84 లక్షలు, 5వ రోజు రూ. 65 లక్షలు, 6వ రోజు రూ. 51 లక్షలు, 7వ రోజు రూ. 41 లక్షలు, 8వ రోజు రూ. 30 లక్షలు, 9వ రోజు రూ. 40 లక్షలు రాబట్టింది. ఈ క్రమంలోనే 10వ రోజు రూ. 54 లక్షలు గ్రాస్ రూ. 28 లక్షలు షేర్ వసూలు చేసింది.

10 రోజుల్లోనూ వసూళ్లు ఇలా
సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ మూవీ పది రోజుల్లో భారీగా రాబట్టింది. ఇక, ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 2.94 కోట్లు, సీడెడ్‌లో రూ. 90 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 3.78 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 10 రోజుల్లో రూ. 7.62 కోట్లు గ్రాస్, రూ. 4.13 కోట్లు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు
పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 7.62 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 18 లక్షలే వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో రూ. 7.80 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 4.22 కోట్లు షేర్ వచ్చింది.

సుధీర్ మూవీకి లాభాలు
బుల్లితెర స్టార్ సుధీర్ హీరోగా చేసిన 'గాలోడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా పది రోజుల్లో రూ. 4.22 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఈ సినిమాకు హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.22 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

సుధీర్ ఖాతాలో మరో రికార్డు
సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీకి మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం మంచిగానే వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచి సత్తా చాటుకుంది. ఇక, ఇప్పుడు ఈ మూవీ ఏకంగా రూ. కోటికి పైగా లాభాలను సొంతం చేసుకుంది. తద్వారా సుడిగాలి సుధీర్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరిపోయింది.


Click it and Unblock the Notifications











