Gaalodu Collections: 3 కోట్ల టార్గెట్.. వారంలోనే అన్ని కోట్లు.. సుధీర్ ఊరమాస్ కుమ్ముడు
సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ బుల్లితెరపై స్టార్‌గా వెలుగొందుతోన్నాడు సుడిగాలి సుధీర్. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. చాా తక్కువ సమయంలోనే ఊహించని ఎత్తుకు ఎదిగిపోయాడు. దీంతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరగడంతో పాటు అవకాశాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే, హీరోగా మాత్రం సుధీర్ అంతగా సక్సెస్ కాలేకపోతోన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే అతడు 'గాలోడు' అనే సినిమాతో హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ వారం రోజుల్లో ఎంత రాబట్టిందో మీరు కూడా చూసేయండి!

గాలోడుగా మారిన సుధీర్
టెలివిజన్ సెన్సేషన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రమే 'గాలోడు'. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఇందులో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

గాలోడు బిజినెస్ వివరాలు
బుల్లితెరపై ప్రభావాన్ని చూపించిన సుడిగాలి సుధీర్.. హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో అతడికి మార్కెట్ ఏర్పడలేదు. కానీ, 'గాలోడు' మూవీపై మాత్రం ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అంటే దాదాపు రూ. 6 కోట్లు గ్రాస్ మేర వసూలు చేయాల్సిన పరిస్థితి.

7వ రోజు ఎంత వచ్చింది?
సుధీర్ నటించిన 'గాలోడు' మూవీని తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతోంది. ఫలితంగా మొదటి రోజు రూ. 1.21 కోట్లు గ్రాస్, రెండో రోజు రూ. 1.14 కోట్లు గ్రాస్, మూడో రోజు రూ. 1.61 కోట్లు గ్రాస్, నాలుగో రోజు రూ. 84 లక్షలు గ్రాస్, ఐదో రోజు రూ. 65 లక్షలు గ్రాస్, ఆరో రోజు రూ. 51 లక్షలు వసూలు అయింది. ఇక ఏడో రోజు దీనికి రూ. 41 లక్షలు గ్రాస్, రూ. 17 లక్షలు షేర్ వచ్చింది.

వారం రోజుల్లో వసూళ్లిలా
సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ మూవీ వారం రోజుల్లో భారీగా రాబట్టింది. ఇక, ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 2.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 3.16 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 7 రోజుల్లో రూ. 6.38 కోట్లు గ్రాస్, రూ. 3.42 కోట్లు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు
వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 6.38 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 13 లక్షలే వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లో రూ. 6.51 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.50 కోట్లు షేర్ వచ్చింది.

సుధీర్ మూవీకి లాభాలు
బుల్లితెర సెన్సేషన్ సుధీర్ నటించిన 'గాలోడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లో రూ. 3.50 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఈ సినిమాకు హిట్ స్టేటస్‌తో పాటు రూ. 50 లక్షలు లాభాలు వచ్చాయి.

భారీ వసూళ్లు రావొచ్చని
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీకి మొదట నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. అదే కంటిన్యూ చేస్తూ కలెక్షన్లు మంచిగానే రాబడుతోంది. ఈ మధ్యన స్టార్ హీరో సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రం ఇంకా భారీ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











