Gaalodu Official Collections: 2వ రోజు ఊహించని వసూళ్లు.. షాకిచ్చిన సుధీర్.. అప్పుడే అన్ని కోట్లా!

తెలుగు బుల్లితెరపైకి సాదాసీదాగానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలితో ప్రేక్షకులను అలరించి.. స్టార్‌గా ఎదిగిపోయాడు సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. అన్ని విభాగాల్లోనూ తనదైన మార్కును చూపించాడు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు అవకాశాలను కూడా అందుకున్నాడు. అలాగే, సినిమాల్లోనూ మెరుస్తూ మజాను పంచుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గాలోడు' అనే సినిమాతో హీరోగా వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ 2 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

గాలోడుగా వచ్చేసిన సుధీర్

గాలోడుగా వచ్చేసిన సుధీర్

ప్రముఖ కమెడియన్ కమ్ యాక్టర్ సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన తాజా చిత్రమే 'గాలోడు'. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఇందులో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ దీనికి సంగీతం అందించారు. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించారు.

గాలోడు బిజినెస్ వివరాలు

గాలోడు బిజినెస్ వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి సుధీర్‌కు అసలు మార్కెట్ లేదు. కానీ, అతడు నటించిన 'గాలోడు' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అంటే దాదాపు రూ. 6 కోట్లు గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. బిజినెస్‌కు తగ్గట్లే దీన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు.

2వ రోజు ఎంత వచ్చింది?

2వ రోజు ఎంత వచ్చింది?

సుధీర్ నటించిన 'గాలోడు' మూవీకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అనుకన్న దానికంటే ఎక్కువ మొత్తమే వచ్చింది. అలాగే, రెండో రోజు కూడా ఈ సినిమా చక్కగా హోల్డ్ చేసింది. దీంతో శనివారం నైజాంలో రూ. 49 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 69 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా రెండో రోజు రూ. 1.14 కోట్లు గ్రాస్, రూ. 63 లక్షలు షేర్ రాబట్టింది.

2 రోజులకు ఎంతొచ్చింది?

2 రోజులకు ఎంతొచ్చింది?

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.21 కోట్లు గ్రాస్, రెండో రోజు రూ. 1.14 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఏరియాల పరంగా చూస్తే.. ఇది నైజాంలో రూ. 85 లక్షలు, సీడెడ్‌లో రూ. 34 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.16 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 2 రోజుల్లో రూ. 2.35 కోట్లు గ్రాస్, రూ. 1.20 కోట్లు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల్లో రూ. 2.35 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 7 లక్షలు వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 2.42 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 1.22 కోట్లు షేర్‌ను వచ్చింది.

టార్గెట్‌కు ఎంత దూరంలో

టార్గెట్‌కు ఎంత దూరంలో

సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 2 రోజుల్లో రూ. 1.22 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.78 కోట్లు షేర్ లేదా రూ. 3.52 కోట్లు గ్రాస్ రాబడితేనే ఇది క్లీన్ హిట్‌ స్టేటస్‌ను చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X