Gaalodu Collections: సుధీర్ మాస్ బ్యాటింగ్.. 2 వారాల్లో సంచలన వసూళ్లు.. లాభం ఎన్ని కోట్లో తెలిస్తే!

తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు ఆల్‌రౌండర్ సుడిగాలి సుధీర్. ఈ ఉత్సాహంతోనే సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అయితే, హీరోగా అతడు చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ యంగ్ టాలెంటెడ్ గాయ్ 'గాలోడు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో సుధీర్ నటించిన 'గాలోడు' మూవీ రెండు వారాల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

గాలోడుగా సుధీర్ విశ్వరూపం

గాలోడుగా సుధీర్ విశ్వరూపం

బుల్లితెర సెన్సేషన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'గాలోడు'. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఈ సినిమాలో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చాడు.

గాలోడు బిజినెస్ వివరాలు

గాలోడు బిజినెస్ వివరాలు

సుదీర్ఘ కాలంగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తోన్న సుడిగాలి సుధీర్.. సినిమాల్లో హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో అతడికి మార్కెట్ రాలేదు. కానీ, 'గాలోడు' మూవీపై మాత్రం ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీనికి తగ్గట్లుగానే గ్రాండ్‌గా విడుదలైంది.

14వ రోజు ఎంత వచ్చింది?

14వ రోజు ఎంత వచ్చింది?


సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' మూవీ చాలా అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట్లో దీనికి మిక్స్‌డ్ టాక్ దక్కింది. దీంతో ఈ చిత్రం సరిగా కలెక్షన్లను రాబట్టలేదేమో అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటి హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 14వ రోజు రూ. 17 లక్షలు గ్రాస్ రూ. 10 లక్షలు షేర్ రాబట్టింది.

2 వారాల్లోనూ వసూళ్లు ఇలా

2 వారాల్లోనూ వసూళ్లు ఇలా

సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ మూవీ 2 వారాల్లో భారీగా రాబట్టింది. ఇక, ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 3.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.01 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 4.18 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 14 రోజుల్లో రూ. 8.47 కోట్లు గ్రాస్, రూ. 4.58 కోట్లు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

2 వారాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 8.47 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 20 లక్షలే వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 14 రోజుల్లో రూ. 8.67 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 4.68 కోట్లు షేర్‌ వసూలు అయింది.

సుధీర్ మూవీకి లాభాలు

సుధీర్ మూవీకి లాభాలు

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 2 వారాల్లో రూ. 4.68 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఈ సినిమాకు హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.68 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

మరో రికార్డుకు చేరువగా

మరో రికార్డుకు చేరువగా


బుల్లితెర సంచలనం సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీకి మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం మంచిగానే వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచి సత్తా చాటుకుంది. ఇక, ఇప్పుడు ఈ మూవీ మరో రూ. 1.33 కోట్లు గ్రాస్‌ను వసూలు చేస్తే పది కోట్ల మార్కును చేరుతుంది. తద్వారా రికార్డు సాధిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X