Gaalodu Collections: సుడిగాలి సుధీర్ సంచలన రికార్డు.. ఏకంగా అన్ని కోట్లతో ఊచకోత

తెలుగు బుల్లితెరపైకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్లతో సత్తా చాటి స్టార్‌గా ఎదిగిపోయాడు టెలివిజన్ ఆల్‌రౌండర్ సుడిగాలి సుధీర్. ఇలా సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగానూ చేశాడు. కానీ, అతడికి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సుధీర్'గాలోడు' అనే సినిమాతో వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా విజయవంతం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా సుధీర్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

గాలోడుగా ఎంటరైన సుధీర్

గాలోడుగా ఎంటరైన సుధీర్

యంగ్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'గాలోడు'. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఈ సినిమాలో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చాడు. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

గాలోడు బిజినెస్ వివరాలు

గాలోడు బిజినెస్ వివరాలు

ఎన్నో ఏళ్లుగా టెలివిజన్ రంగంలో సత్తా చాటుతోన్న సుడిగాలి సుధీర్.. సినిమాల్లో హీరోగా సక్సెస్ అవలేకపోయాడు. దీంతో అతడికి మార్కెట్ రాలేదు. కానీ, 'గాలోడు' మూవీపై మాత్రం ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీనికి తగ్గట్లుగానే వైభవంగా విడుదలైంది.

20వ రోజు ఎంత వచ్చింది?

20వ రోజు ఎంత వచ్చింది?

సుధీర్ నటించిన 'గాలోడు' మూవీ చాలా అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట్లో దీనికి మిక్స్‌డ్ టాక్ దక్కింది. దీంతో ఈ చిత్రం సరిగా ఆడదు అని అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటి హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 20వ రోజు కూడా వసూళ్లను రాబట్టింది. తద్వారా నిన్న 8 లక్షలు రాబట్టింది.

20 వారాల్లోనూ వసూళ్లు ఇలా

20 వారాల్లోనూ వసూళ్లు ఇలా

సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ మూవీ 20 రోజుల్లో భారీగా రాబట్టింది. ఇక, ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 3.63 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.18 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 4.57 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 20 రోజుల్లో రూ. 9.38 కోట్లు గ్రాస్, రూ. 5.07 కోట్లు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

20 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 9.38 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 21 లక్షలే వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 20 రోజుల్లో రూ. 9.59 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 5.17 కోట్లు షేర్‌ కలెక్ట్ చేసింది.

సుధీర్ సినిమాకు లాభాలు

సుధీర్ సినిమాకు లాభాలు

బుల్లితెర స్టార్ సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 20 రోజుల్లో రూ. 5.17 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఈ సినిమాకు హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.17 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

సుధీర్ ఖాతాలో మరో రికార్డ్

సుధీర్ ఖాతాలో మరో రికార్డ్

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీకి మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం మంచిగానే వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచి సత్తా చాటుకుంది. ఇక, ఇప్పుడు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్లుకు పైగా షేర్‌ను రాబట్టింది. ఫలితంగా సుధీర్ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X