Gaalodu Collections: సుధీర్ ఊరమాస్.. 5 రోజుల్లోనే అన్ని కోట్లు.. ఇంకో 3 లక్షలు వస్తే చరిత్రే!
తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ బడా సెలెబ్రిటీగా వెలుగొందుతోన్నాడు జబర్ధస్త్ ఫేమస్ కమెడియన్ సుడిగాలి సుధీర్. యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్, డైలాగ్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ తనదైన మార్కును క్రియేట్ చేసుకున్న అతడు.. టాలీవుడ్‌లో హీరోగా సత్తా చాటాలని పరితపిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే సుడిగాలి సుధీర్ 'గాలోడు' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'గాలోడు' మూవీ 5 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

గాలోడుగా సుధీర్ సందడి
బుల్లితెర ఆల్‌రౌండర్‌గా పేరొందిన సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రమే 'గాలోడు'. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఇందులో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించారు. భీమ్స్ దీనికి సంగీతం అందించారు.

గాలోడు బిజినెస్ వివరాలు
హీరోగా కొన్ని సినిమాలు చేసినా సుడిగాలి సుధీర్‌కు తెలుగు రాష్ట్రాల్లో అసలు మార్కెట్ ఏర్పడలేదు. కానీ, అతడు నటించిన 'గాలోడు' మూవీపై మాత్రం ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అంటే దాదాపు రూ. 6 కోట్లు గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది.

5వ రోజు ఎంత వచ్చింది?
సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' మూవీని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లే దీనికి మొదటి రోజు రూ. 1.21 కోట్లు గ్రాస్, రెండో రోజు రూ. 1.14 కోట్లు గ్రాస్, మూడో రోజు రూ. 1.61 కోట్లు గ్రాస్, నాలుగో రోజు రూ. 84 లక్షలు గ్రాస్ వసూలు అయింది. ఈ క్రమంలోనే ఐదో రోజు కాస్త తగ్గి దీనికి రూ. 65 లక్షలు గ్రాస్‌తో పాటు రూ. 30 లక్షలకు పైగా షేర్ వచ్చింది.

5 రోజులకు ఎంతొచ్చింది?
సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీకి అనుకున్నట్లుగానే కలెక్షన్లు మంచిగా వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో చక్కగా రానించింది. ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 2.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 69 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 2.72 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 5 రోజుల్లో రూ. 5.45 కోట్లు గ్రాస్, రూ. 2.92 కోట్లు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు
ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 5.45 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 10 లక్షలు వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 5.55 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 2.97 కోట్లు షేర్‌ను వచ్చింది.

టార్గెట్‌కు ఎంత దూరంలో
సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 రోజుల్లో రూ. 2.97 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 3 లక్షలు షేర్ లేదా రూ. 45 లక్షలు గ్రాస్ రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

సుడిగాలి సుధీర్‌కు సక్సెస్
సుడిగాలి సుధీర్ ఇప్పటికే 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీ మంకీస్', 'వాంటెడ్ పండుగాడ్' సహా పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ, ఇవేమీ అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. అలాంటిది ఇప్పుడు 'గాలోడు' మూవీ మాత్రం ఆరో రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోబోతుంది. ఫలితంగా సుడిగాలి సుధీర్ కెరీర్‌లో హీరోగా మొట్టమొదటి విజయం సొంతం కాబోతుంది.


Click it and Unblock the Notifications











