twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Gaalodu Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. సుధీర్ మాస్ కుమ్ముడు.. మరో 6 లక్షలు వస్తే రికార్డు

    |

    యాక్టింగ్, డ్యాన్స్, మ్యాజిక్, సాంగ్స్, కామెడీ ఇలా ఎన్నో రకాల టాలెంట్లను చూపిస్తూ తెలుగు బుల్లితెరపై స్టార్‌గా వెలుగొందుతోన్నాడు సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కుర్రాడు.. అనతి కాలంలోనే ఫుల్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. అయితే, సినిమాల్లో హీరోగా మాత్రం అతడు సక్సెస్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సుధీర్ 'గాలోడు' అనే సినిమాతో హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ 9 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరు కూడా చూడండి!

    గాలోడుగా ఎంటరైన సుధీర్

    గాలోడుగా ఎంటరైన సుధీర్

    బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'గాలోడు'. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఇందులో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

    బ్రా కూడా లేకుండా కరీనా రచ్చ: తల్లైనా తెగించేసిన హీరోయిన్బ్రా కూడా లేకుండా కరీనా రచ్చ: తల్లైనా తెగించేసిన హీరోయిన్

    గాలోడు బిజినెస్ వివరాలు

    గాలోడు బిజినెస్ వివరాలు

    టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తోన్న సుడిగాలి సుధీర్.. హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో అతడికి మార్కెట్ రాలేదు. కానీ, 'గాలోడు' మూవీపై మాత్రం ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అంటే దాదాపు రూ. 6 కోట్లు గ్రాస్ మేర వసూలు చేయాల్సి ఉంటుంది.

    9వ రోజు ఎంత వచ్చింది?

    9వ రోజు ఎంత వచ్చింది?

    సుధీర్ 'గాలోడు' మూవీని తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతోంది. ఫలితంగా తొలి రోజు రూ. 1.21 కోట్లు గ్రాస్, 2వ రోజు రూ. 1.14 కోట్లు, 3వ రోజు రూ. 1.61 కోట్లు, 4వ రోజు రూ. 84 లక్షలు, 5వ రోజు రూ. 65 లక్షలు, 6వ రోజు రూ. 51 లక్షలు, 7వ రోజు రూ. 41 లక్షలు, 8వ రోజు రూ. 30 లక్షలు రాబట్టింది. ఈ క్రమంలోనే 9వ రోజు మళ్లీ పుంజుకుని రూ. 40 లక్షలు గ్రాస్ రూ. 20 లక్షలు షేర్ కలెక్ట్ చేసింది.

    పబ్లిక్‌లోనే హీరోయిన్ శ్రీయ కొంటె పని: నా భర్తకు అలా చేస్తేనే ఇష్టమంటూ షాకింగ్‌గా!పబ్లిక్‌లోనే హీరోయిన్ శ్రీయ కొంటె పని: నా భర్తకు అలా చేస్తేనే ఇష్టమంటూ షాకింగ్‌గా!

    9 రోజుల్లోనూ వసూళ్లు ఇలా

    9 రోజుల్లోనూ వసూళ్లు ఇలా

    సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ మూవీ తొమ్మిది రోజుల్లో భారీగా రాబట్టింది. ఇక, ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 2.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 86 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 3.52 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 9 రోజుల్లో రూ. 7.08 కోట్లు గ్రాస్, రూ. 3.85 కోట్లు షేర్ రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

    తొమ్మిది రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 7.08 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 17 లక్షలే వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో రూ. 7.25 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 3.94 కోట్లు షేర్‌ వచ్చింది.

    Bigg Boss: శ్రీహాన్ బండారం బట్టబయలు.. సిరి ఉన్నా ఆ అమ్మాయితో.. ఒకేసారి ఇద్దరితో అంటూ ట్విస్ట్Bigg Boss: శ్రీహాన్ బండారం బట్టబయలు.. సిరి ఉన్నా ఆ అమ్మాయితో.. ఒకేసారి ఇద్దరితో అంటూ ట్విస్ట్

    సుధీర్ మూవీకి లాభాలు

    సుధీర్ మూవీకి లాభాలు

    సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా తొమ్మిది రోజుల్లో రూ. 3.94 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఈ సినిమాకు హిట్ స్టేటస్‌తో పాటు రూ. 94 లక్షలు లాభాలు కూడా వచ్చాయి.

    మరో 6 లక్షలు వస్తే రికార్డ్

    మరో 6 లక్షలు వస్తే రికార్డ్

    సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీకి మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం మంచిగానే వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. అదే కంటిన్యూ చేస్తూ ఇప్పటికే రూ. 94 లక్షలు లాభాలను కూడా సొంతం చేసుకుంది. దీంతో మరో 6 లక్షలు రాబడితే ఇది కోటి మార్కును చేరి రికార్డు సాధిస్తుంది.

    English summary
    Jabardasth Talented Comedian Sudigali Suయాక్టింగ్, డ్యాన్స్, మ్యాజిక్, సాంగ్స్, కామెడీ ఇలా ఎన్నో రకాల టాలెంట్లను చూపిస్తూ తెలుగు బుల్లితెరపై స్టార్‌గా వెలుగొందుతోన్నాడు సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కుర్రాడు.. అనతి కాలంలోనే ఫుల్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. అయితే, సినిమాల్లో హీరోగా మాత్రం అతడు సక్సెస్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సుధీర్ ‘గాలోడు’ అనే సినిమాతో హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ 9 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరు కూడా చూడండి!dheer Did Gaalodu Movie Under Rajasekar Reddy Pulicharla Direction. This Movie Collects Rs 7.25 cr Gross in 9 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X