Gaalodu Total Collections: సుడిగాలి సుధీర్ సంచలనం.. బిజినెస్‌కు డబుల్ వసూళ్లు.. లాభమే అన్ని కోట్లు

బుల్లితెరపై అసాధారణ ప్రతిభతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు సుడిగాలి సుధీర్. అలా సుదీర్ఘ కాలంగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేశాడు. ఆ తర్వాత హీరోగానూ మారి కొన్ని సినిమాలు చేశాడు. ఇక, ఇటీవలే సుధీర్ 'గాలోడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టోటల్ కలెక్షన్లపై లుక్కేద్దాం పదండి!

గాలోడుగా సుధీర్ అరాచకం

గాలోడుగా సుధీర్ అరాచకం

బుల్లితెర సెన్సేషన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'గాలోడు'. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఈ సినిమాలో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చాడు. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

గాలోడు బిజినెస్ వివరాలు

గాలోడు బిజినెస్ వివరాలు


సుదీర్ఘ కాలంగా టెలివిజన్ రంగంలో సత్తా చాటుతోన్న సుడిగాలి సుధీర్.. సినిమాల్లో హీరోగా సక్సెస్ అవలేకపోయాడు. దీంతో అతడికి మార్కెట్ రాలేదు. కానీ, 'గాలోడు' మూవీపై మాత్రం ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీనికి తగ్గట్లుగానే గ్రాండ్‌గా విడుదలైంది.

అలాంటి టాక్‌తోనే వసూళ్లు

అలాంటి టాక్‌తోనే వసూళ్లు


టాలెంటెడ్ గాయ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభావాన్ని చూపించింది. దీంతో అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా విశేషమైన వసూళ్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల వసూళ్లు

తెలుగు రాష్ట్రాల వసూళ్లు

సుధీర్ నటించిన 'గాలోడు' మూవీ చాలా అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఇది తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఫలితంగా ఫుల్ రన్‌లో నైజాంలో రూ. 3.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.26 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 4.75 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా మొత్తంగా రూ. 9.71 కోట్లు గ్రాస్, రూ. 5.25 కోట్లు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

ఫుల్ రన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 9.71 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 20 లక్షలే వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఓవరాల్‌గా రూ. 9.91 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 5.35 కోట్లు షేర్‌ కలెక్ట్ చేసింది.

సుధీర్ సినిమాకు లాభాలు

సుధీర్ సినిమాకు లాభాలు

బుల్లితెర స్టార్ సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ. 5.35 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఈ సినిమాకు హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.35 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

సుధీర్ రికార్డ్.. ఓటీటీలోకి

సుధీర్ రికార్డ్.. ఓటీటీలోకి


సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీకి మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం మంచిగానే దక్కాయి. దీంతో ఈ చిత్రం అత్యధిక వసూళ్లతో హిట్ అయింది. దీంతో సుధీర్‌ మొదటి హిట్ అందుకుని రికార్డు సాధించాడు. ఇక, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ, దీనిపై క్లారిటీ మాత్రం రావడంలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X