Gaalodu Official Collections: సుధీర్ మాస్ కుమ్ముడు.. తొలి రోజే అంత కలెక్షనా.. ఎంతొస్తే హిట్ అంటే!

సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెరపై ఈ పేరు ఒక సెన్సేషన్. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా తనదైన స్టార్‌డమ్‌తో సత్తా చాటుతోన్నాడు. కామెడీ, యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, సాంగ్స్, మ్యాజిక్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకున్నాడు. తద్వారా సినిమా అవకాశాలను కూడా అందుకుంటోన్నాడు. ఇందులో భాగంగానే తాజాగా సుడిగాలి సుధీర్ 'గాలోడు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? చూద్దామా!

గాలోడుగా ఎంటరైన సుధీర్

గాలోడుగా ఎంటరైన సుధీర్


జబర్దస్త్ టాప్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన తాజా చిత్రమే 'గాలోడు'. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఇందులో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ దీనికి సంగీతం అందించారు. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించారు.

గాలోడు బిజినెస్ వివరాలు

గాలోడు బిజినెస్ వివరాలు


సుడిగాలి సుధీర్‌కు తెలుగు రాష్ట్రాల్లో అసలు మార్కెట్ లేదు. కానీ, అతడు నటించిన 'గాలోడు' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

అలాంటి టాక్‌... రెస్పాన్స్

అలాంటి టాక్‌... రెస్పాన్స్


బుల్లితెర ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' మూవీ విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. కానీ, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ప్రేక్షకుల స్పందన మాత్రం భారీగానే వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి.

తొలి రోజు ఎంత వచ్చింది?

తొలి రోజు ఎంత వచ్చింది?


సుధీర్ నటించిన 'గాలోడు' మూవీకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 50 - 60 లక్షలు గ్రాస్ వసూలు అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, అనూహ్యంగా ఈ సినిమాకు రూ. నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 47 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది. మొత్తంగా తొలిరోజు రూ. 1.01 కోట్లు గ్రాస్, రూ. 48 లక్షలు షేర్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రోజే రూ. 1.01 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 3 లక్షలు వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 1.04 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 50 లక్షలు షేర్‌ను కలెక్ట్ చేసింది.

టార్గెట్‌కు ఎంత దూరంలో

టార్గెట్‌కు ఎంత దూరంలో

సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మొదటి రోజు రూ. 50 లక్షలు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.50 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X