Gaalodu Weekend Collections: ఆదివారం రోజు సుధీర్ దూకుడు.. 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే?

సుడిగాలి సుదీర్ నటించిన గాలోడు సినిమా విడుదలకు ముందు పెద్దగా హడావిడిగా చేసినట్లుగా కనిపించలేదు. టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సుధీర్ వెండితెరపై అసలు కలెక్షన్స్ అందుకుంటాడా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ ఈ మాస్ కమర్షియల్ సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఇక ఆదివారానికి సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా మొదటి వారంతరం కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

డీసెంట్ బిజినెస్

డీసెంట్ బిజినెస్


గాలోడు సినిమాకు ఎక్కువగా బీ,సీ సెంటర్ల నుంచి మంచి మద్దతు లభించింది. మాస్ ఆడియన్స్ ఈ సినిమాకు మంచి క్రేజ్ అయితే వచ్చింది. అలాగే ఈ వారం పోటీగా ఎలాంటి పెద్ద సినిమా లేకపోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మూడు కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసినట్లు అంచనా.. అంటే మూడు కోట్లకు పైగా షేర్ కలక్షన్స్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క.

మొదటి షోలకు అలా..

మొదటి షోలకు అలా..

అసలు మొదటి రోజు ఈ సినిమా విడుదల హడావిడి కూడా మరీ అంత ఎక్కువగా ఏమీ కనిపించలేదు. మార్నింగ్ షోలకు అంతంత మాత్రమే టాక్ వచ్చింది. కానీ ఫస్ట్ షో నుంచి కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగాయి. ఇక నైట్ షో కి వచ్చేసరికి సినిమా కలెక్షన్స్ మరింత పెరుగుతూ వచ్చాయి. దీంతో ఈ సినిమా మొదటిరోజు ఎవరు ఊహించని విధంగా 90 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు టాక్ వచ్చింది.

 సెకండ్ డే ఎక్కువగా..

సెకండ్ డే ఎక్కువగా..

ఇక రెండవ రోజు కూడా దాదాపు అదే తరహాలో మార్నింగ్ షో లకు సందడి చూపించిన గాలోడు సినిమా సెకండ్ షో కు వచ్చేసరికి మరింత కలెక్షన్స్ అందుకుంది. దీంతో ఈ సినిమా రెండవ రోజు మొదటి రోజు కంటే కాస్త ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. రెండవ రోజు దాదాపు 96 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

మూడవ రోజు ఎంతంటే..

మూడవ రోజు ఎంతంటే..

ఇక మూడవ రోజు కలెక్షన్స్ కూడా కొంత పెరిగినట్లుగా టాక్ అయితే వస్తోంది. ఆదివారం కావడంతో జనాలకు ఇప్పుడు అందుబాటులో ఉన్న సినిమా ఇది మాత్రమే. అయితే ఈ సినిమాకు పోటీగా మసూద కొంత పోటీగా ఉన్నప్పటికీ రెండవ రోజు సుడిగాలి సుదీర్ ప్రమోషన్స్ తో కొంత హడావిడి క్రియేట్ చేశాడు. దీనితో మూడవరోజు ఈ సినిమాకు 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.

 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

ఇక మొత్తంగా గాలోడు సినిమా మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ అందుకున్నట్లు అనిపిస్తుంది. ఈ వారంతరం సినిమాకు చాలా బాగా ఉపయోగపడింది. మొత్తంగా మూడు రోజుల్లో గాలోడు సినిమా 2.83 కోట్ల నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే కొన్ని ఏరియాలలో ప్రాఫిట్ జోన్ లోకి వచ్చింది. ఇక సోమవారం నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలుకానుంది. మరో రెండు మూడు రోజులు ఇదే తరహాలో కొనసాగితే మాత్రం సుధీర్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X