Gaalodu: సుధీర్ మూవీకి షాకింగ్ బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే గాలోడు హిట్.. థియేటర్ల లెక్క చూస్తే!

తెలుగు బుల్లితెరపై సందడి చేస్తూ.. ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న వారిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఒకడు. కామెడీ, యాక్టింగ్, డ్యాన్స్, సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణించిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతోన్నాడు. ఇక, ఇప్పుడు ఈ స్టార్ కమెడియన్ కమ్ హీరో 'గాలోడు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ సినిమాకు ఓవరాల్‌గా ఎంత బిజినెస్ జరిగింది? ఎన్ని థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది? చూద్దామా!

గాలోడుగా మారిపోయిన సుధీర్

గాలోడుగా మారిపోయిన సుధీర్

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'గాలోడు'. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఇందులో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ దీనికి సంగీతం అందించారు. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఇది నవంబర్ 18వ తేదీన విడుదల కాబోతుంది.

అలాంటి స్టోరీ.. ఫుల్ యాక్షన్‌తో

అలాంటి స్టోరీ.. ఫుల్ యాక్షన్‌తో

అల్లరి చిల్లరిగా తిరుగుతున్న ఓ కుర్రాడు.. ముందు అమ్మాయిని ప్రేమించడం.. ఆమె కోసం తిరగడం.. ఆ తర్వాత విలన్స్ ఎంట్రీ జైలుకు వెళ్లడం.. అక్కడి నుంచి వచ్చి ప్రతీకారం తీర్చుకోవడం వంటి పాయింట్లతో 'గాలోడు' సినిమా తెరకెక్కింది. ఇందులో సుధీర్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ప్రమోషన్స్ పూర్తి.. సందడిగానే

ప్రమోషన్స్ పూర్తి.. సందడిగానే

సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, శుక్రవారమే దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సుధీర్‌కు ప్రముఖుల మద్దతు

సుధీర్‌కు ప్రముఖుల మద్దతు

చిన్న కమెడియన్‌గా ప్రయాణాన్ని ప్రారంభించి.. పెద్ద స్టార్‌గా ఎదిగిపోయిన సుడిగాలి సుధీర్.. హీరోగా సక్సెస్ అవ్వాలని చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'గాలోడు' అనే సినిమాతో రాబోతున్నాడు. దీంతో అతడికి విజయం రావాలని ఫ్యాన్స్‌తో పాటు ప్రముఖులు కోరుతున్నారు. ఇందుకోసం సినిమాను ప్రమోట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు.

అన్ని థియేటర్లలో వస్తుందిగా

అన్ని థియేటర్లలో వస్తుందిగా

సుడిగాలి సుధీర్ నటించిన 'గాలోడు' సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 130, సీడెడ్‌లో 60, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 185 థియేటర్లలో విడుదల కాబోతుంది. అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 375 థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది.

సుధీర్ గాలోడు బిజినెస్ చూస్తే

సుధీర్ గాలోడు బిజినెస్ చూస్తే

ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'గాలోడు' మూవీపై సుడిగాలి సుధీర్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలను కలుపుకుని మొత్తంగా సుడిగాలి సుధీర్ సినిమాకు రూ. 2.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ సమాచారం.

ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే

ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే

జబర్ధస్త్ టాప్ కమెడయన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' సినిమాకు ఊహించని విధంగా కాస్త ఎక్కువగానే రూ. 2.75 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 3 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత వసూలు చేస్తేనే సుడిగాలి సుధీర్ సినిమా విజయం సాధిస్తుంది. మంచి టాక్ వస్తే.. ఈ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X