Sudigali Sudheer: కెరీర్ లోనే మొదటిసారి బిగ్ బడ్జెట్ మూవీగా గాలోడు.. సుధీర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో మంచి గుర్తింపు అందుకున్న సుడిగాలి సుదీర్ అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా క్రేజ్ అందుకున్నాడు. జబర్దస్త్ ద్వారా అతనికి ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతకు ముందు వరకు ఒక మెజీషియన్ హోస్ట్ వ్యవహరించిన సుధీర్ ఆ తర్వాత జబర్దస్త్ లోకి వెళ్ళాడు. ఇప్పుడు సినిమా హీరోగా కూడా అతను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు సుధీర్ కెరీర్ లో బిగ్ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన సినిమా విడుదలకు సిద్ధమయింది. ఇక ఆ సినిమా బడ్జెట్ ఎంత అలాగే ఏ స్థాయిలో పారితోషికం అందుకున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ ద్వారా
సుడిగాలి సుదీర్ మొదట జబర్దస్త్ లో ఒక రైటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత రెగ్యులర్ కమెడియన్ గా మారిపోయాడు. అనంతరం అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ గా కూడా అతను మరో మెట్టుకు ఎదిగాడు. ఆ తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోకుండా అతను జబర్దస్త్ తో పాటు మరికొన్ని కామెడీ షోలలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

సినిమాల్లో కూడా
ఒకవైపు టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూనే మరొకవైపు సుధీర్ పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా కూడా నటిస్తూ వచ్చాడు. నిత్యం ఇండస్ట్రీలో బిజీ యాక్టర్ గా అతను మారిపోతున్నాడు.. సుడిగాలి సుదీర్ గత ఏడాది అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో కూడా డిఫరెంట్ పాత్రలో కనిపించాడు. ఇక ఈ ఏడాది అతను కొన్ని సినిమాల్లో ప్రముఖ పాత్రల్లో కూడా కనిపించడం విశేషం.

గాలోడు బడ్జెట్ ఎంతంటే
ఇక ఇప్పుడు గాలోడు అనే సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంతకుముందు సుధీర్ 3 మంకీస్ అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా కంటే ఈ సినిమాను కాస్త ఎక్కువ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటివరకు సుదీర్ నటించిన చిన్న సినిమాల్లో ఇదే ఎక్కువ బడ్జెట్ తో రూపొందినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపుగా 2.50 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం.

హీరోగా సుధీర్ రెమ్యునరేషన్
గాలోడు సినిమాకు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమా కోసం అతను దాదాపు 40 నుంచి 50 నుంచి లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. కామెడీ షోలతో ఒకరోజు ఎపిసోడ్ కు దాదాపు రెండు లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ వస్తున్న సుధీర్ ఇప్పుడు సినిమాల ద్వారా ఊహించిన విధంగా ఆదాయాన్ని అందుకుంటున్నాడు. మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.

బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక గాలోడు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఎక్కువ ధియేటర్లలోనే విడుదల చేయబోతున్నారు. నైజాం ఏరియాలో 130 థియేటర్లో అలాగే సీడెడ్ లో 65 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రలో 180 కు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే దాదాపు 375 థియేటర్లలో విడుదలవుతున్న గాలోడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 2.75 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మూడు కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











