Prasanna Vadanam 2 Days Collections: 2 రోజుల్లో షాకింగ్ కలెక్షన్లు.. సుహాస్ హిట్ కొడతాడా అంటే!
సహజసిద్ధమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో సుహాస్. దీనికితోడు ఇప్పటి వరకూ అతడు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో ఈ యంగ్ హీరో మార్కెట్, ఫాలోయింగ్ పెరుగుతూనే వెళ్తోంది.
ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు సుహాస్ 'ప్రసన్న వదనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. దీనికి మంచి టాక్ వచ్చినా ఆడియెన్స్ రెస్పాన్స్ మాత్రం ఆశించిన రీతిలో దక్కడం లేదు. ఈ నేపథ్యంలో 'ప్రసన్న వదనం' సినిమా రెండు రోజుల్లో ఎంత వసూళ్లు సాధించిందో మీరే చూడండి!

సుహాస్ మరో ప్రయోగం
టాలెంటెడ్ గాయ్ సుహాస్ నటించిన మూవీనే 'ప్రసన్న వదనం'. అరుణ్ వైకే తీసిన ఈ మూవీని మణికంట జేఎస్, ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. దీనికి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌లుగా చేశారు. అలాగే, ఇందులో నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవా హర్షలు కీలక పాత్రలను పోషించారు.

సుహాస్ మూవీ బిజినెస్
హీరోగా పరిచయం అయినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ.. విజయాలను అందుకుంటూ వెళ్తోన్న సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' మూవీపై అంచనాలను భారీ స్థాయిలో ఏర్పరచుకుంది. తద్వా మంచి డిమాండ్‌ను పెంచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 2.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.
2వ రోజు ఎంత వచ్చింది?
గతంలో ఎవరూ టచ్ చేయని కథతో రూపొందిన 'ప్రసన్న వదనం' మూవీకి టాక్ మంచిగా వచ్చినా రెస్పాన్స్‌ను ఆశించిన రీతిలో అందుకోలేదు. రెండో రోజు కూడా ఈ సినిమా అదే హోల్టును కనబరుచుకుంది. ఫలితంగా ఈ సినిమాకు శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 26 లక్షలు షేర్ వసూలు అయింది. అలాగే, రూ. 45 లక్షలు గ్రాస్‌ను ఇది రాబట్టుకుంది.

2 రోజులకు కలిపి ఎంత?
సుకుమార్ శిష్యుడు అరుణ్ వైకే దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటించిన 'ప్రసన్న వదనం' సినిమాకు మిగిలిన వాటి నుంచి పోటీ ఉండడంతో పాటు టాక్ కూడా ఆశించినట్లుగా రాలేదు. దీంతో రెండు రోజుల్లోనూ తెలుగు ప్రేక్షకుల నుంచి మోస్తరు స్పందనే లభించిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా ఈ సినిమాకు రూ. 51 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.00 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన 'ప్రసన్న వదనం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 51 లక్షలు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 19 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి రెండు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 70 షేర్‌తో పాటు రూ. 1.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
విభిన్నమైన సబ్జెక్టుతో తెరకెక్కిన 'ప్రసన్న వదనం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.50 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లో సుహాస్ సినిమాకు రూ. 70 లక్షలు వచ్చాయి. అంటే మరో రూ. 1.80 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











