Prasanna Vadanam 7 Days Collections: 2 కోట్లు రావాలి.. వారంలోనే రికార్డు.. సుహాస్ సంచలన రికార్డు
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టి.. హీరోగా మారిన తర్వాత వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు టాలెంటెడ్ గాయ్ సుహాస్. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యమా ఫామ్‌లో ఉన్న అతడు.. అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇటీవలే 'ప్రసన్న వదనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. దీనికి మంచి టాక్ వచ్చినా ఆడియెన్స్ రెస్పాన్స్ మాత్రం ఆశించిన రీతిలో దక్కడం లేదు. ఈ నేపథ్యంలో 'ప్రసన్న వదనం' సినిమా మొదటి వారంలో రోజుల్లో ఎంత వసూళ్లు సాధించిందో మీరే చూడండి!
క్రేజీ కాన్సెప్టుతో వచ్చాడు:టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన మూవీనే 'ప్రసన్న వదనం'. అరుణ్ వైకే తీసిన ఈ మూవీని మణికంట జేఎస్, ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. దీనికి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌లుగా చేశారు. అలాగే, ఇందులో నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవా హర్షలు కీలక పాత్రల్లో నటించారు.

సుహాస్ మూవీ బిజినెస్:హీరోగా మారినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ.. విజయాలను అందుకుంటూ దూసుకుపోతోన్న సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' మూవీపై అంచనాలను భారీ స్థాయిలో ఏర్పరచుకుంది. తద్వా మంచి డిమాండ్‌ను పెంచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 1.80 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది.
7వ రోజు ఎంత వచ్చింది?:టాలీవుడ్‌లోనే ఎవరూ టచ్ చేయని స్టోరీతో రూపొందిన 'ప్రసన్న వదనం' మూవీకి టాక్ మంచిగా వచ్చినా రెస్పాన్స్‌ను ఆశించిన రీతిలో అందుకోలేదు. తర్వాత కూడా ఇది క్రమంగా డౌన్ అవుతూనే వస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు ఏడో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 7 లక్షలు షేర్ వసూలు అయింది. అలాగే, రూ. 10 లక్షలు గ్రాస్‌ను ఇది రాబట్టుకుంది.

7 రోజులకు కలిపి ఎంత?:సుకుమార్ కాంపౌండ్‌కు చెందిన అరుణ్ వైకే దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటించిన 'ప్రసన్న వదనం' సినిమాకు మిగిలిన వాటి నుంచి పోటీ ఉండడంతో పాటు టాక్ కూడా ఆశించినట్లుగా రాలేదు. దీంతో వారం రోజుల్లో దీనికి నైజాంలో రూ. 75 లక్షలు షేర్, ఆంధ్రాలో రూ. 90 లక్షలు షేర్ వచ్చింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.65 కోట్లు షేర్, రూ. 3.85 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:టాలెంటెడ్ యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన 'ప్రసన్న వదనం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 7 రోజుల్లో రూ. 1.65 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 45 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి వారం రోజుల్లో ఈ చిత్రానికి రూ. 2.10 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభం ఇలా:'ప్రసన్న వదనం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.80 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.00 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో సుహాస్ సినిమాకు రూ. 2.10 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10 లక్షలు వచ్చాయి. తద్వారా సుహాస్ ఖాతాలో హ్యాట్రిక్ విజయాలు నమోదు అయ్యాయి.


Click it and Unblock the Notifications











